బెల్లంకొండ బాబు కూడా గెస్ట్‌ అయ్యాడే!

బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అల్లుడు శ్రీను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించగా యావరేజ్ టాకు వచ్చినా కూడా బ్రేక్ ఈవెన్‌ సాధించలేక పోయింది.

 Bellamkonda Sai Srinivas Guest For Nenu Meeku Baaga Kaavalsina Vaadini Pre Relea-TeluguStop.com

అప్పటి నుండి ఇప్పటి వరకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సక్సెస్ ల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.అతడి ప్రయత్నాలు చూస్తుంటే ముచ్చటేస్తుంది.

కానీ పాపం అతడికి సక్సెస్ మాత్రం దక్కడం లేదు అంటూ అభిమానించే వారు అంటూ ఉన్నారు.ప్రస్తుతం హిందీలో మన తెలుగు చత్రపతి ని రీమేక్ చేస్తున్నాడు.

కచ్చితంగా ఇక్కడ దక్కని సక్సెస్ హిందీ లో దక్కుతుందని నమ్మకం తో సాయి శ్రీనివాస్ ఉన్నాడు.సినిమా విడుదల ఎప్పుడు అనే విషయం లో క్లారిటీ ఇవ్వడం లేదు కానీ అతి త్వరలోనే చత్రపతిగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ గ్యాప్ లో ఈ బెల్లంకొండ బాబు నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు.ఫేమస్ స్టార్స్‌ ని ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లకి పిలవడం మనం చూస్తూనే ఉంటాం.

ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి దక్కిన గుర్తింపు స్టార్డం కారణంగా నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది.అతడి రాకతో సినిమాకి బజ్ క్రియేట్ అయిందని తప్పకుండా సినిమా మంచి సక్సెస్ ని దక్కించుకుంటుందంటూ చిత్ర సభ్యులు చెప్తున్నారు.

మొదటిసారి బెల్లంకొండ బాబు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్ట్ గా రావడం ఆయన యొక్క సన్నిహితులకు అభిమానులకు ఒకింత ఆశ్చర్యంగా సంతోషంగా ఉందట.ఇక నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా విషయానికొస్తే కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ సినిమా ఈవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మంచి ఎంటర్టైన్మెంట్ తో ఈ సినిమా ఉంటుందని యూనిట్ సభ్యులు చెప్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube