టాలీవుడ్ జక్కన్న రాజమౌళి( Rajamouli ) దర్శకత్వం లో వచ్చిన మొదటి బ్లాక్ బస్టర్ చిత్రం ‘చత్రపతి’( Chatrapati ).ప్రభాస్ హీరోగా శ్రియ హీరోయిన్ గా రూపొందిన చత్రపతి చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ప్రభాస్ స్టామినా ఏంటో ఆ సమయంతోనే నిరూపితమైంది.ఆ సినిమా తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోల సరసన ప్రభాస్ నిలిచాడు అనడంలో సందేహం లేదు.
అద్భుతమైన టేకింగ్ తో పాటు ఒక మంచి సెంటిమెంటు ఓరియెంటెడ్ కథ తో రాజమౌళి చత్రపతి సినిమా ను రూపొందించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.ఇప్పుడు ఆ సినిమా ను హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్ ( Bellamkonda Srinivas )హీరో గా వినాయక్ రీమిక్స్ చేస్తున్న విషయం తెలిసిందే.
సినిమా రీమేక్ అంటే అదే టైటిల్ తో వస్తేనే బాగుంటుంది కనుక టైటిల్ విషయం లో గత కొన్ని రోజులుగా చర్చలు జరిగాయి.హిందీ కి చెందిన ఒక నిర్మాత చత్రపతి టైటిల్ ని రిజిస్టర్ చేసి పెట్టారట.
దాంతో ఆ టైటిల్ కోసం నిర్మాత జయంతి లాల్ చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఎట్టకేలకు ఆయన భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని టైటిల్ ని ఇచ్చేందుకు నిర్మాత అంగీకరించినట్లుగా తెలుస్తోంది.

మరో వైపు చత్రపతి ఒరిజినల్ సినిమా ను హిందీ లో డబ్ చేసి యూట్యూబ్ లో విడుదల చేయడం జరిగింది.అక్కడ కూడా సినిమాను తొలగించాల్సి ఉంది.ఒకవేళ అక్కడ తొలగించకుండా హిందీ వర్షన్ చత్రపతి స్ట్రీమింగ్ అయితే థియేటర్లో విడుదల అవ్వడం మంచిది కాదు.అందుకే అక్కడ కూడా చత్రపతి సినిమా కు ఉన్న అడ్డంకిని తొలగించుకోవాలని భావిస్తున్నారు.
ఈ రెండు అడ్డంకులు తొలగిన తర్వాత ఇప్పటికే షూటింగ్ పూర్తయిన హిందీ చత్రపతి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు అధికారికంగా తేదీని ప్రకటిస్తారని సమాచారం అందుతుంది.ఈ సినిమా కోసం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దాదాపు ఏడాది కాలం పాటు చాలా కష్టపడ్డారు.
ఫిజిక్ మెయింటైన్ చేయడం కోసం ఆయన తీసుకున్న డైట్ మరియు ఇతర జాగ్రత్తలు నిజంగా గొప్ప విషయం అంటూ చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుకుంటున్నారు.