ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన బెల్లంకొండ సురేష్ కొడుకులు ఇద్దరూ హీరోలుగా పరిచయమయ్యారు.పెద్ద కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు శ్రీను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
ఇక తాజాగా బెల్లంకొండ సాయి గణేష్ స్వాతిముత్యం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.సాయి గణేష్ కి ఒక మంచి సినిమా దక్కిందని చెప్పాలి.
కానీ నిర్మాతల అత్యుత్సాహం సినిమా యొక్క ఫ్లాప్ కి కారణం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇద్దరు పెద్ద హీరోల సినిమా అది కూడా వారిద్దరు దసరా బరిలో పోటా పోటీగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
అలాంటి ఇద్దరు పెద్ద హీరోలా మధ్య కొత్త హీరో అది కూడా బెల్లంకొండ సాయి గణేష్ వంటి ఒక ఫ్రెష్ ఫేస్ ని తీసుకొచ్చి ఇరికించే ప్రయత్నం చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని అభిప్రాయం వ్యక్తం అయ్యింది.

చాలా మంది చాలా రకాలుగా చెప్పి చూసినా కూడా నిర్మాత నాగవంశీ మాత్రం ఈ సినిమా చిన్నది అయ్యి ఉండవచ్చు, కానీ మా బ్యానర్ పెద్దది.మా బ్యానర్ లో వచ్చిన సినిమా లు చాలా పెద్ద సినిమా లు కనుక ఈ సినిమా కూడా పెద్ద సినిమానే చిరంజీవి సినిమా తో పోటీ పడుతుంది అంటూ స్వాతిముత్యం సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.దసరా సీజన్ లో కాకుండా మరెప్పుడైనా ఈ సినిమా విడుదల అయ్యుంటే తప్పకుండా ఒక మంచి సినిమా అన్నట్లుగా పేరు దక్కించుకునేది.
మినిమం వసూళ్లను ఈ సినిమా రాబట్టేది అంటూ విశ్లేషకులు బల్ల గుద్ది మరీ చెప్తున్నారు.దీంతో బెల్లంకొండ సాయి గణేష్ కెరీయర్ ని నిర్మాత ఇబ్బందుల్లో పెట్టినట్లు అయ్యింది అంటూ బెల్లంకొండ వర్గీయులు కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయమై నిర్మాత నాగ వంశీ ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.







