గాడ్ ఫాదర్ సినిమా అంచనాలకు మించి విజయం సాధించడంతో చిరంజీవి జోష్ లో ఉన్నారు.తన డ్యాన్స్ తో సినిమా రంగంలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న చిరంజీవి ఏ డ్యాన్స్ చేసినా ఆ డ్యాన్స్ కు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తారనే సంగతి తెలిసిందే.
చిరంజీవి డ్యాన్స్ ల కోసమే ఆయన సినిమాలను చూసే ఎంతోమంది అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ సంప్రదాయమైన పోతురాజు స్టెప్పులు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
చిరంజీవి పోతురాజు స్టెప్పులు వేస్తుంటే చూడటానికి రెండు కళ్లు సరిపోవడం లేదని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.దసరా పండుగ సందర్భంగా జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులతో పాటు మెగాస్టార్ చిరంజీవి సైతం పాల్గొన్నారనే సంగతి తెలిసిందే.
కళాకారులతో కలిసి చిరంజీవి పోతురాజు స్టెప్పులు వెయ్యడంతో పాటు పోతురాజుల దగ్గర ఉండే చెర్నాకోలను తీసుకుని చిరంజీవి కాలు కదపడం గమనార్హం.ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
చిరంజీవి డ్యాన్స్ చేసిన వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుండగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోకు రికార్డ్ స్థాయిలో లైక్స్ వస్తుండటం గమనార్హం.

67 సంవత్సరాల వయస్సులో కూడా చిరంజీవి ఎనర్జీ ఊహించని రేంజ్ లో ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలలొ నటిస్తున్నారు.వాల్తేరు వీరయ్య సినిమా స్ట్రెయిట్ సినిమా కాగా భోళా శంకర్ సినిమా మాత్రం వేదాళం మూవీ రీమేక్ అనే సంగతి తెలిసిందే.
రీమేక్ సినిమాలు చిరంజీవి కెరీర్ కు ప్లస్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా కూడా మెగా హీరో కోరుకున్న సక్సెస్ ను అందిస్తుందేమో చూడాలి.సినిమాసినిమాకు చిరంజీవికి క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.







