తెలుగు సినీ ప్రేక్షకులకు బెల్లంకొండ గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ గణేష్.
ఇటీవల స్వాతిముత్యం అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఈ సినిమాలో అమాయకుడి పాత్రలో నటించి తన నటనతో అదరగొట్టాడు బెల్లంకొండ గణేష్.ఇది ఇలా ఉంటే తాజాగా బెల్లంకొండ గణేష్ కు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త అందర్నీ ఆశ్చర్యానికు గురిచేస్తోంది.
అదేమిటంటే బెల్లంకొండ గణేష్ ఎంతో ఇష్టపడి కొన్న ఐఫోన్ పోయిందని, పోలీసులే కొట్టేశారని ఏకంగా పోలీస్ కమిషనర్‌కే ఫిర్యాదు చేశాడు.కాగా ప్రస్తుతం ఈ వార్త తెగ వైరల్ అవుతోంది.
అయితే ఇదంతా నిజం కాదు.బెల్లంకొండ గణేష్ నటిస్తున్న తదుపరి సినిమా టీజర్ లోని ఒక సంఘటన.
స్వాతిముత్యం సినిమాతో మంచి విజయం అందుకున్న బెల్లంకొండ గణేష్ ప్రస్తుతం తన తదుపరి సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.అసలు మా పేరు నేను స్టూడెంట్ సర్.రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సతీష్ వర్మ నిర్మిస్తున్నారు.అంతేకాకుండా రాఖీ ఉప్పలపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.
ఇందులో గణేష్ సరసన అవంతిక దస్సానీ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను దర్శకుడు వివి వినాయక చేతుల మీదుగా విడుదల చేశారు మూవీ మేకర్స్.కాగా టీజర్ లో గణేష్ ఒక కాలేజీ స్టూడెంట్ గా నటిస్తున్నారు.ఐఫోన్ అంటే అతనికి పిచ్చి.
కొత్త ఐఫోన్ సిరీస్ రావడంతో 90000 పెట్టి మరి ఐఫోన్ ని కొనుగోలు చేశాడు.కానీ అది పోయింది.
అయితే పోలీసులే ఆ ఫోన్ని కొట్టేసారని పోలీస్ స్టేషన్ పైనే కేసు పెట్టేందుకు సిద్ధపడ్డాడు గణేష్.ఇందుకోసం ఏకంగా కమిషనర్ నే కలిసాడు.
మరి ఆ ఐఫోన్ దొరికిందా? నిజంగా ఆ ఫోన్ పోలీసులే దొంగలించారా? గణేష్ న్యాయం కోసం ఏం చేశాడు అన్న ఆధారంగా ఈ సినిమా రూపొందునుంది.ఈ సినిమాలో కూడా గణేష్ అమాయకుడి పాత్రలోనే కనిపించబోతున్నారు.
త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.







