నేను స్టూడెంట్ సార్ మూవీ రివ్యూ...

Bellamkonda Ganesh Avantika Dassani Nenu Student Sir Movie Review Details, Nenu Student Sir, Hero Bellamkonda Ganesh , Heroine Avantika Dassani, Nenu Student Sir Movie Review , Nenu Student Sir Movie, Nenu Student Sir Movie Story, Samuthirakani,

నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో తనయుడి , హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ సాయి గణేష్( Bellamkonda Sai Ganesh ) హీరోగా నటించిన చిత్రం నేను స్టూడెంట్ సార్ .( Nenu Student Sir Movie ) స్వాతిముత్యం అనే సినిమాతో హీరోగా లాంచ్ అయిన గణేష్ .

 Bellamkonda Ganesh Avantika Dassani Nenu Student Sir Movie Review Details, Nenu-TeluguStop.com

తన ఇన్నోసెంట్ యాక్టింగ్ తో బెల్లంకొండ బ్రదర్ అందరి దృష్టిలో పడ్డాడు.ఈ నేపథ్యంలో ఇప్పుడు నేను స్టూడెంట్ సర్’ అంటూ మరో సినిమా చేశాడు రాఖీ ఉప్పలపాటి( Director Rakhi Uppalapati ) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని .సతీష్ వర్మ నిర్మించాడు.పెద్దగా ప్రమోషన్స్ లేకుండానే సినిమా ఆడియెన్స్ ముందుకు వస్తుంది .అయితే ట్రైలర్ కొంత ఆకట్టుకునేలా ఉండటం సినిమాపై అంచనాలని పెంచింది .మరి అంచనాలని అందుకునే స్థాయిలో మూవీ ఉందా లేదా అనేది రివ్యూ లో చూద్దాం…

Telugu Nenu Sir, Nenu Sir Review, Nenu Sir Story, Samuthirakani-Movie

ముందుగా కధ విషయానికి వస్తే ., సుబ్బారావు అనే ఓ సాధారణ మిడిల్ క్లాస్ యువకుడి కధ ఇది .పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ డబ్బు కూడబెట్టుకొని ఒక ఐఫోన్ ను కొనుక్కున్నా సుబ్బారావు ఫోన్ లో అనుకోకుండా ఒక హత్యకు సంబంధించిన వీడియో రికార్డ్ అవడంతో అతని జీవితం తలక్రిందులవుతుంది …ఆ మర్డర్ తో తనకు సంబంధం లేదని సుబ్బారావు చెప్తున్నా.పోలీస్ కమిషనర్ అర్జున్ వాసుదేవన్‌ మాత్రం అతడినే దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు.దీనికి తోడు అతని బ్యాంక్ అకౌంట్ లోకి భారీగా డబ్బు జమ కావడంతో పరిస్థితులు మరింత దిగజారతాయి .మరి అసలు ఆ హత్య ఎవరు చేశారు .సుబ్బారావు ని ఇరికించే ప్రయత్నం ఎందుకు జరిగింది .దాని నుంచి అయన ఎలా బయటపడ్డాడు అనేది సినిమా కధ ఇక విశ్లేషణ విషయానికి వస్తే .సినిమా మొదలైనప్పుడు సాధారణంగానే ఉంటుంది…

Telugu Nenu Sir, Nenu Sir Review, Nenu Sir Story, Samuthirakani-Movie

ఒక మధ్యతరగతి యువకుడి ఆలోచనలు ఇందులో చూపించే ప్రయత్నం చేశారు .అలాగే ఫోన్ కొని మురిసిపోవడం .ఆ విషయం తన తల్లికి చెప్పడం.ఆ ఫోన్ ను సొంత తమ్ముడిగా భావించి బుచ్చిబాబు అని పేరు కూడా పెట్టడం ఇవన్నీ సరదాగా సాగిపోతూ ఉంటాయి .అలాగే ఖరీదైన ఫోన్ కొన్న సంతోషంతో సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ సంబరపడిపోఏ సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి .అలానే తన ప్రేయసితో కలిసి పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేసి సీన్స్ అలరిస్తాయి .అయితే ఎప్పుడైతే హత్య విషయం బయటకు వస్తుందో అప్పుడు కధ మరో మలుపు తిర్గుతుంది .ఫోన్ లో అనుకోకుండా ఒక హత్యకు సంబంధించిన వీడియో రికార్డ్ అవడం.సిటీ పోలీస్ కమిషనర్ అర్జున్ వాసుదేవన్‌ తో పోరాటం ఆసక్తి కలిగిస్తాయి .ఇక సుబ్బూకి సపోర్ట్ గా యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ రంగంలోకి దిగి, కమిషనర్ కు ఎదుర్కునే సీన్లు అలరిస్తాయి .అలాగే క్లయిమాక్స్ మెప్పిస్తుంది .

Telugu Nenu Sir, Nenu Sir Review, Nenu Sir Story, Samuthirakani-Movie

ఇక సాంకేతిక విషయాలకే వస్తే .రాఖీ ఉప్పలపాటి ఒక ఆసక్తికరమైన కథతో వచ్చాడు.కథనంలో మలుపులతో ఆకర్షించాడు.మహతి స్వర సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లుక్ అండ్ ఫీల్ తీసుకొచ్చింది.ఇక నటీనటుల విషయానికి వస్తే గణేష్ తన పాత్రతో మెప్పించాడు.సముద్రఖని ( Samudrakani ) విలన్ గా ఆకట్టుకునాయుడు .అవంతిక దాసాని( Avantika Dassani ) హీరోయిన్ గా అలరించింది … ప్రముఖ నటి భాగ్యశ్రీ కూతురు అయినా ఈమె తన నటనతో మెప్పించింది .మిగతా వారు ఒకే అనిపిస్తారు మొత్తంగా చూస్తే.అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు మినహా సినిమా ఒకే అనిపిస్తుంది .

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube