నేను స్టూడెంట్ సార్ మూవీ రివ్యూ…

నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో తనయుడి , హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ సాయి గణేష్( Bellamkonda Sai Ganesh ) హీరోగా నటించిన చిత్రం నేను స్టూడెంట్ సార్ .

( Nenu Student Sir Movie ) స్వాతిముత్యం అనే సినిమాతో హీరోగా లాంచ్ అయిన గణేష్ .

తన ఇన్నోసెంట్ యాక్టింగ్ తో బెల్లంకొండ బ్రదర్ అందరి దృష్టిలో పడ్డాడు.ఈ నేపథ్యంలో ఇప్పుడు నేను స్టూడెంట్ సర్' అంటూ మరో సినిమా చేశాడు రాఖీ ఉప్పలపాటి( Director Rakhi Uppalapati ) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని .

సతీష్ వర్మ నిర్మించాడు.పెద్దగా ప్రమోషన్స్ లేకుండానే సినిమా ఆడియెన్స్ ముందుకు వస్తుంది .

అయితే ట్రైలర్ కొంత ఆకట్టుకునేలా ఉండటం సినిమాపై అంచనాలని పెంచింది .మరి అంచనాలని అందుకునే స్థాయిలో మూవీ ఉందా లేదా అనేది రివ్యూ లో చూద్దాం.

"""/" / ముందుగా కధ విషయానికి వస్తే ., సుబ్బారావు అనే ఓ సాధారణ మిడిల్ క్లాస్ యువకుడి కధ ఇది .

పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ డబ్బు కూడబెట్టుకొని ఒక ఐఫోన్ ను కొనుక్కున్నా సుబ్బారావు ఫోన్ లో అనుకోకుండా ఒక హత్యకు సంబంధించిన వీడియో రికార్డ్ అవడంతో అతని జీవితం తలక్రిందులవుతుంది .

ఆ మర్డర్ తో తనకు సంబంధం లేదని సుబ్బారావు చెప్తున్నా.పోలీస్ కమిషనర్ అర్జున్ వాసుదేవన్‌ మాత్రం అతడినే దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు.

దీనికి తోడు అతని బ్యాంక్ అకౌంట్ లోకి భారీగా డబ్బు జమ కావడంతో పరిస్థితులు మరింత దిగజారతాయి .

మరి అసలు ఆ హత్య ఎవరు చేశారు .సుబ్బారావు ని ఇరికించే ప్రయత్నం ఎందుకు జరిగింది .

దాని నుంచి అయన ఎలా బయటపడ్డాడు అనేది సినిమా కధ ఇక విశ్లేషణ విషయానికి వస్తే .

సినిమా మొదలైనప్పుడు సాధారణంగానే ఉంటుంది. """/" / ఒక మధ్యతరగతి యువకుడి ఆలోచనలు ఇందులో చూపించే ప్రయత్నం చేశారు .

అలాగే ఫోన్ కొని మురిసిపోవడం .ఆ విషయం తన తల్లికి చెప్పడం.

ఆ ఫోన్ ను సొంత తమ్ముడిగా భావించి బుచ్చిబాబు అని పేరు కూడా పెట్టడం ఇవన్నీ సరదాగా సాగిపోతూ ఉంటాయి .

అలాగే ఖరీదైన ఫోన్ కొన్న సంతోషంతో సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ సంబరపడిపోఏ సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి .

అలానే తన ప్రేయసితో కలిసి పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేసి సీన్స్ అలరిస్తాయి .

అయితే ఎప్పుడైతే హత్య విషయం బయటకు వస్తుందో అప్పుడు కధ మరో మలుపు తిర్గుతుంది .

ఫోన్ లో అనుకోకుండా ఒక హత్యకు సంబంధించిన వీడియో రికార్డ్ అవడం.సిటీ పోలీస్ కమిషనర్ అర్జున్ వాసుదేవన్‌ తో పోరాటం ఆసక్తి కలిగిస్తాయి .

ఇక సుబ్బూకి సపోర్ట్ గా యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ రంగంలోకి దిగి, కమిషనర్ కు ఎదుర్కునే సీన్లు అలరిస్తాయి .

అలాగే క్లయిమాక్స్ మెప్పిస్తుంది . """/" / ఇక సాంకేతిక విషయాలకే వస్తే .

రాఖీ ఉప్పలపాటి ఒక ఆసక్తికరమైన కథతో వచ్చాడు.కథనంలో మలుపులతో ఆకర్షించాడు.

మహతి స్వర సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లుక్ అండ్ ఫీల్ తీసుకొచ్చింది.

ఇక నటీనటుల విషయానికి వస్తే గణేష్ తన పాత్రతో మెప్పించాడు.సముద్రఖని ( Samudrakani ) విలన్ గా ఆకట్టుకునాయుడు .

అవంతిక దాసాని( Avantika Dassani ) హీరోయిన్ గా అలరించింది .ప్రముఖ నటి భాగ్యశ్రీ కూతురు అయినా ఈమె తన నటనతో మెప్పించింది .

మిగతా వారు ఒకే అనిపిస్తారు మొత్తంగా చూస్తే.అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు మినహా సినిమా ఒకే అనిపిస్తుంది .

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి 1, శనివారం 2025