హెయిర్ ఫాల్ తగ్గి జుట్టు ఒత్తుగా పెరగాలా? అయితే మీ డైట్ లో ఇది ఉండాల్సిందే!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హెయిర్ ఫాల్ కు బాధితులుగా ఉన్నారు.

అయితే హెయిర్ ఫాల్ అనేది కొందరిలో కాస్త తక్కువగా ఉంటే కొందరిలో మరీ ఎక్కువగా ఉంటుంది.

ఎలా ఉన్నా హెయిర్ ఫాల్ ను వదిలించుకోవడం కోసం ఎవరికి వారు తోచిన చిట్కాలను పాటిస్తుంటారు.రకరకాల హెయిర్ ప్యాక్ లు వేసుకుంటూ ఉంటారు.

అయితే జుట్టు రాలడం ఆగాలంటే పైపై పూతలే సరిపోవు.జుట్టు ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలు కూడా అందించాలి.

అందుకే జుట్టు ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు డైట్ లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.

Advertisement

అటువంటి ఆహారాల్లో ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ కూడా ఒకటి.ఈ జ్యూస్ ను కనుక డైట్ లో చేర్చుకుంటే హెయిర్ ఫాల్ కు సులభంగా చెక్ పెట్టవచ్చు.అదే సమయంలో జుట్టును ఒత్తుగా పెంచుకోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ జ్యూస్ ఏంటో.ఎలా తయారు చేసుకోవాలో ఓ చూపు చూసేయండి.

ముందు రెండు ఉసిరికాయలు తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి గింజ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక మీడియం సైజు బీట్ రూట్ ను తీసుకుని తొక్క చెక్కేసి వాటర్ తో కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని కట్ చేసి పెట్టుకున్న బీట్ రూట్ ముక్కలు, ఉసిరికాయ ముక్కలు వేసుకోవాలి.అలాగే రెండు రెబ్బల కరివేపాకు, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, చిటికెడు బ్లాక్ సాల్ట్ మరియు ఒక గ్లాస్ వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

వైరల్ : కొడుకు కోసం ఆ తండ్రి బిర్యానీతో పడిన కష్టం.. ఎమోషనల్ స్టోరీ..
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

Advertisement

ఆమ్లా బీట్ రూట్ జ్యూస్ ను వారంలో కనీసం నాలుగు సార్లు అయినా తీసుకోవాలి.ఈ జ్యూస్ ను డైట్ లో చేర్చుకుంటే జుట్టు కుదుళ్ళు బలంగా ఆరోగ్యంగా మారతాయి.దాంతో జుట్టు రాలడం క్రమంగా తగ్గు ముఖం పడుతుంది.

అదే సమయంలో కురులు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతాయి.ఈ జ్యూస్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల జుట్టు త్వరగా తెల్లబడకుండా సైతం ఉంటుంది.

తాజా వార్తలు