పర్యావరణ వ్యవస్థ సమతుల్యతను కాపాడడంలో జీవవైవిధ్యం ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది.అంతరించిపోతున్న జీవవైవిధ్యం భూమిని వినాశనం వైపు నడిపిస్తోంది.
పెరుగుతున్న మానవ జనాభా, అటవీ నిర్మూలన, వేటాడటం, కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ కారణంగా అనేక జాతుల వృక్షజాలం, జంతుజాలం అంతరించిపోతున్నాయి.అందువల్ల, జీవవైవిధ్యంపై పొంచి ఉన్న ముప్పు మానవ ఉనికికి కూడా ప్రమాదకరం.
ఈ తరుణంలో తేనెటీగలు ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్నాయనే వార్త అందరినీ కలవరానికి గురి చేస్తోంది.జీవవైవిధ్యానికి తేనెటీగలకు అవినాభావ సంబంధం ఉంది.
భూమి మీద ఉన్న 90 శాతానికి పైగా పంటలు, వృక్షాలు తేనెటీగలపైనే ఆధారపడి ఉన్నాయి.తేనెటీగలు పూర్తిగా అంతరించిపోతే భూమి మీద ఉన్న జీవులన్నీ కేవలం 30 రోజుల్లోనే చనిపోతాయి.
అంతటి ప్రాధాన్యం ఉన్న తేనెటీగలు అధిక సంఖ్యలో మరణిస్తున్నాయి.దీని వల్ల దుష్పరిణామల గురించి తెలుసుకుందాం.

తేనెటీగల ప్రాధాన్యంపై ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వంటి గొప్ప శాస్త్రవేత్త అద్భుతంగా తెలిపారు.“తేనెటీగలు భూమి మీద అదృశ్యమైతే, మనిషికి జీవితం కేవలం 4 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది.తేనెటీగలు లేనప్పుడు, పరాగసంపర్కం ఉండదు.ఫలితంగా మొక్కలు, జంతువులు, మానవులు మనుగడ సాగించలేరు.” అని వెల్లడించారు.తేనెటీగలు 70 శాతం పంటలను పరాగసంపర్కం చేస్తాయి.
తేనెటీగల పరాగసంపర్కం నుంచే మనం వినియోగించే ఆహారంలో మూడింట ఒక వంతు లభిస్తుంది.తేనెటీగలు లేకపోతే, మూడు నెలల్లోపు పంట దిగుబడి ప్రపంచ వ్యాప్తంగా తగ్గుతుంది.
ఆహారం దొరకదు.

తక్కువ వైవిధ్యమైన, తక్కువ పోషకాలతో కూడిన ఆహారం మాత్రం ఉంటుంది.పోషకాహార లోపం ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది.తేనెటీగల సంరక్షణకు అన్ని దేశాలూ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఐక్య రాజ్య సమితి ఇటీవల కోరింది.
దీంతో వీటి ప్రాధాన్యత ఎంత ఉందో అర్ధం అవుతోంది.ముఖ్యంగా పంటల సాగులో ఎక్కువ మొత్తంలో పురుగుల మందులు వాడుతుండడంతో తేనెటీగలు మరణిస్తున్నాయని పలు అధ్యయనాలలో తేలింది.
ఇది మరింత ఎక్కువ స్థాయిలో ఉంటే మరిన్ని అనర్ధాలు జరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.







