ఆ మేగజైన్ కవర్ పేజ్ పై బేబమ్మ .. టాక్ ఆఫ్ ది టౌన్..!

టాలీవుడ్ లో ఎప్పుడూ హీరోయిన్స్ కొరత ఉంటూ వస్తుంది.కొత్తగా ఎవరైనా హీరోయిన్ వచ్చి సక్సెస్ అందుకుంటే చాలు ఆమెకి స్టార్ క్రేజ్ ఇచ్చేస్తారు.

 Bebamma Krithi Shetty On She India Megazine Cover Page Krithi Shetty , She Ind-TeluguStop.com

రోజుకొక కొత్త హీరోయిన్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నా స్టార్ సినిమాల్లో నటించే కథనాయికలకు ఎప్పుడూ కొరత ఉంటూనే వస్తుంది.ఈ క్రమంలో ఉప్పెన సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి.

మొదటి సినిమాతోనే సెన్సేషనల్ హిట్ అందుకున్న ఈ అమ్మడు తొలి సినిమాతోనే స్టార్ జాబితాలో చేరింది.

ఉప్పెన హిట్ పడగానే అరడజనకు పైగా ఆఫర్లు వచ్చాయి.

ఉప్పెన తర్వాత శ్యాం సింగ రాయ్, బంగార్రాజు రెండు సినిమాలు హిట్ పడటంతో అమ్మడి కెరియర్ ఫుల్ స్వింగ్ లో ఉంది.ప్రస్తుతం రామ్ తో ది వారియర్, సుధీర్ బాబుతో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, నితిన్ తో మాచర్ల నియోజకవర్గం సినిమాల్లో నటిస్తుంది కృతి శెట్టి.

ఈమధ్య కాలంలో ఒక హీరోయిన్ కు ఈవిధమైన క్రేజ్ రావడం కృతి శెట్టికే అని చెప్పొచ్చు.

Telugu Bebamma, Krithi, Krithi Shetty, India Magazine, Uppena-Movie

ఆడియెన్స్ లో ఆమెకున్న క్రేజ్ ని చూసి ప్రముఖ మేగజైన్ ల కవర్ పేజ్ లపై కూడా ఆమెని తీసుకుంటున్నారు.ప్రముఖ షీ ఇండియా (She India) మేగజైన్ కవర్ పేజ్ లో కృతి శెట్టి అలరిస్తుంది.కవర్ పేజ్ పై కృతి శెట్టి ది టాక్ ఆఫ్ ది టౌన్ అంటూ ఆమె గురించి స్పెషల్ కవరేజ్ చేశారు.

తన క్యూట్ లుక్స్ తో కుర్రాళ్లని ఆకట్టుకుంటున్న కృతి శెట్టి తెలుగులో స్టార్ డం ని ఎంజాయ్ చేస్తుంది.వరుస సినిమాలు అందుకు తగిన పారితోషికం తీసుకుంటూ ప్రస్తుతం తెలుగు తెర మీద తన సత్తా చాటుతుంది కృతి శెట్టి.

ఈమధ్య అమ్మడికి కోలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వచ్చినట్టు తెలుస్తుంది.తప్పకుండా అమ్మడికి అక్కడ కూడా మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube