ఒంటెలకూ బ్యూటీ కంటెస్ట్.. ఈ సంగతి మీకు తెలుసా?

అందంగా కనిపించడం కోసం యువతీ యువకులు ప్రయత్నిస్తుంటారు.ఇక సెలబ్రిటీలు అయితే అందం కోసం చాలా కసరత్తలు చేస్తుంటారు.

ఈ క్రమంలోనే కాస్మోటిక్స్ కూడా వాడుతుంటారు.ఇకపోతే యువతులలో అందమైన వారిని కనుగొనేందుకుగాను బ్యూటీ కంటెస్టులు నిర్వహించడం జరుగుతుంటుంది.

అలా కంటెస్టులు ఒంటెలకూ నిర్వహిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి.అలా ఉండబోదు అని మీరనుకుంటే పొరపడినట్లే.

జంతువుల కోసం కంటెస్టులు నిర్వహిస్తున్నారు.సౌదీ అరేబియాలో ఇలా జంతువులను అందంగా ముస్తాబు చేస్తున్నారు.

Advertisement

ఇందుకుగాను వారు యానిమల్స్‌పైన కాస్మోటిక్స్ ఉపయోగిస్తున్నారు.ఈ కాస్మోటిక్స్ వల్ల యానిమల్స్ హెల్త్ పైన ఎఫెక్ట్ ఉండే చాన్సెస్ ఉన్నప్పటికీ అలానే చేస్తున్నారు సౌదీ అరేబియన్ వాసులు.

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో ప్రతీ సంవత్సరం ఒంటెల పండుగను గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు.వన్ మంత్ పాటు ఇలా ఉత్సవాలను నిర్వహిస్తుంటారు.ఈ నెల రోజులు జరిగే ఒంటెల బ్యూటీ ఫెస్ట్‌లో అందమైన ఒంటెల పెంపకం దారులకు రూ.66 కోట్లు ప్రైజ్‌ మనీ ఇస్తారు నిర్వాహకులు.ఈ నేపథ్యంలోనే ఆ ప్రైజ్ మనీ గెలుచుకునేందుకుగాను సౌదీ అరేబియన్ వాసులు తమ ఒంటెలను చాలా అందంగా ముస్తాబు చేసి తీసుకొస్తుంటారు.

అందాల ఒంటెల పోటీలో ఒంటెలన్నీ చాలా అందంగా కనబడుతుంటాయి.ఒంటెల నడవడికను బట్టి నిర్వాహకులు అందమైన ఒంటెలను సెలక్ట్ చేస్తారు.

అత్యాధునికమైన టెక్నాలజీని ఉపయోగించి ఒంటెల్లో అందమైన ఒంటెలను నిర్వాహకులు సెలక్ట్ చేస్తారు.అయితే, ఒంటెల శరీర భాగాలను రసాయనాలు ఉపయోగించి పెంచినట్లయితే వాటిని పోటీలో పరిగణనలోకి తీసుకోరు.ఈ విషయాన్ని తెలుసుకునేందుకుగాను నిర్వాహకులు ప్రతీ ఒంటెను క్షుణ్ణంగా పరిశీలిస్తారు.

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం... వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!
ఒలంపిక్ పతకాలలో నిజంగా బంగారం ఉంటుందా..? లేదా..?

పరిశీలన తర్వాతనే ఒంటెల్లో అందమైన ఒంటెను గుర్తిస్తారు.ఈ క్రమంలోనే ఒంటెలను హింసకు గురైనట్లు తెలుసుకుని, అలా చేసిన వారిపైన చర్యలు కూడా తీసుకుంటారు నిర్వాహకులు.

Advertisement

తాజా వార్తలు