కొన్ని కొన్ని సార్లు జంతువులు చేసే పనులు నవ్వులు తెప్పిస్తూ ఉంటాయి.మొన్నామధ్య కోతి మనిషిలా బట్టలు ఉతికిన ఘటన సోషల్ మీడియా లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు తాజాగా ఒక పిల్ల ఎలుగుబంటి చేసిన పనికి మరోసారి నెటిజన్లు నవ్వుకుంటున్నారు.రుమేనియా వెళ్తే అక్కడి ఓ వన్యమృగ సంరక్షణ కేంద్రంలో ఎలుగుబంట్లు తిరుగాడుతూ ఉంటాయి.
వాటిని చూడటానికి పలువురు విజిటర్లు పోటెత్తుతూ ఉంటారు కూడా.అయితే ఎలుగు బంకి పుట్టిన పిల్లలు అయితే మరీ మనుషులంటే ఏ మాత్రం భయంలేకుండా సమీపం వరకు వచ్ఛేస్తాయి కూడా.
అలాంటి ఒక పిల్ల ఎలుగు ఓ సరదా సీన్ చేసింది.నిజంగా మనుషులకు కూడా ఒక్కోసారి దురద పుట్టినప్పుడు ఇలానే గోడకు రుద్దుకుంటూ ఉంటారు.
సుమారు రెండున్నర ఏళ్ళ గోధుమరంగు ఎలుగు కూడా అదే పని చేసింది.

కానీ అది చేసిన తీరుకు అందరూ ఫిదా అవుతున్నారు.ఓ పెద్ద రాయివద్దకు వెళ్లిన ఆ పిల్ల ఎలుగు దురద పుడుతున్న తన వెన్నును ఆ రాయికి రుద్దుకున్న వైనం చూడాల్సిందే.మొదట తన రెండు కాళ్ళూ పైకెత్తి అచ్ఛు ఓ చిన్నారి డ్యాన్స్ చేస్తున్నట్టే పైకీ.
కిందకీ ఆడించింది.అయితే దీనిని గమనించిన ఒక విజిటర్ దానిని తన కెమెరా లో బంధించాడు.
ఇక సోషల్ మీడియా లో ఈ వీడియో పోస్ట్ చేయడం తో ప్రస్తుతం వైరల్ గా మారింది.