రాజధాని విషయంలో కమిటీల పేరుతో జగన్ సర్కార్ ఎన్ని నాటకాలు ఆడినా.మరోసారి అడ్డంగా బుక్కయింది.
ఈసారి రిపోర్ట్ ఇచ్చిన కమిటీయే జగన్‌ను బుక్ చేసింది.ఇంతకుముందు జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ రాకముందే మూడు రాజధానులన్న తన మనసులోని మాటను అసెంబ్లీ సాక్షిగా జగన్ బయటపెట్టారు.
ఆ తర్వాత కమిటీ కూడా అచ్చూ జగన్ చెప్పినట్లే రిపోర్ట్ ఇచ్చింది.జగనే నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక కమిటీలు ఎందుకన్న విమర్శలు వచ్చాయి.తాజాగా బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కూడా తన రిపోర్ట్‌ను ప్రభుత్వానికి ఇచ్చింది.ఈ రిపోర్ట్ కూడా జగన్ కోరుకున్నట్లే ఉంది.
ఎలాగూ ఆ తర్వాత ఇలాంటి విమర్శలే వస్తాయని అనుకుందో మరేంటోగానీ.ఈ రిపోర్ట్‌లో జగన్ సర్కార్‌కు బీసీజీ ఇరికించింది.
ప్రభుత్వం ఏం అడిగిందో అదే రాసిచ్చాం తప్ప.ఈ రిపోర్ట్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని అందులో చెప్పడం గమనార్హం.రాజధానిని మూడు ముక్కలు చేయమని తాము చెప్పలేదని.ఆ ముక్కలను ఎలా చేయాలో మాత్రమే చెప్పామని బీసీజీ స్పష్టం చేసింది.ఆ లెక్కన రాజధానిని వికేంద్రీకరిస్తున్నామని ముందుగానే బోస్టన్ గ్రూప్‌కు ప్రభుత్వం చెప్పి రిపోర్ట్ తెప్పించుకున్నట్లు అర్థమవుతోంది.
అయితే తన రిపోర్ట్‌లో మాత్రం అమరావతిపై పెట్టుబడి పెట్టడం అనవసరమని, ఇందులో పది శాతం విశాఖలో పెట్టినా ఎంతో అభివృద్ధి జరుగుతుందన్న సూచనలు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ చేయడం విశేషం.
ఈ మాట కూడా గతంలో జగన్ అసెంబ్లీలో చెప్పినదే.విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం.అక్కడో మెట్రో వేస్తే చాలు అని జగన్ ఎప్పుడో చెప్పారు.ఇప్పుడు బీసీజీ కూడా అందుకు తగినట్లే రిపోర్ట్ ఇచ్చింది.
రెండు కమిటీలు ప్రభుత్వం ఎలా చెప్పాయో అలా చేశాయి.ఇక హైపవర్ కమిటీ ఒకటి మిగిలి ఉంది.అది ఈ రెండు కమిటీల నివేదికను సమీక్షించి మరో నివేదిక ఇవ్వనుంది.అది కూడా ఎలాగూ ప్రభుత్వం చెప్పినట్లే చేస్తుందన్న విమర్శలు ఇప్పటికే వ్యక్తమవుతున్నాయి.జగన్ ఎలాగూ మూడు ముక్కలాటకు డిసైడయ్యారని, ఈ కమిటీలంతా ఓ ప్రహసనం అని ప్రతిపక్ష టీడీపీ ఆరోపణలు గుప్పిస్తోంది.