ఈ మాటలు అన్నది ఏ చోటా మోటా లీడర్ కాదు.ఆయనో ఎంపీ.
![Mp Aravindh Comments On Kcr And Assaduddin Owaisi Mp Aravindh Comments On Kcr And Assaduddin Owaisi-TeluguStop.com](https://telugustop.com/wp-content/uploads/2020/01/MP-Aravindh-Comments-On-KCR-And-Assaduddin-Owaisi-Telugu.jpg)
కేసీఆర్ కూతురు కవితపై గెలిచిన ఎంపీ.ఆయన పేరు ధర్మపురి అరవింద్.
నిజామాబాద్ ఎంపీ.పౌరసత్వ సవరణ చట్టంపై ఆయన స్పందిస్తూ.
కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ముస్లింల ఓట్ల కోసం చట్టాన్ని కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు.
![Telugu Kcrasaduddin, Mp Aravindh, Mparavindh, Nizamabadmp- Telugu Kcrasaduddin, Mp Aravindh, Mparavindh, Nizamabadmp-](https://telugustop.com/wp-content/uploads/2020/01/MP-Aravindh-Comments-On-KCR-And-AssaduddinOwaisi.jpg)
కేసీఆర్ ఓ గడ్డం లేని ముల్లా అని అన్నారు.హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ గడ్డం తీసి కేసీఆర్‌కు అతికిస్తానని, అసద్‌ను నిజామాబాద్‌లో క్రేన్‌కు వేలాడదీస్తానని అరవింద్ అనడం గమనార్హం.నిజామాబాద్ గడ్డ.బీజేపీ అడ్డా అని ఆయన నినదించారు.నీ సొంత ఇలాకాలో నీ తమ్ముడిని కత్తులతో పొడిస్తే కాపాడలేని వ్యక్తి.బీజేపీని ఏదో చేస్తాడంట అని అసదుద్దీన్‌పై మండిపడ్డారు.
![Telugu Kcrasaduddin, Mp Aravindh, Mparavindh, Nizamabadmp- Telugu Kcrasaduddin, Mp Aravindh, Mparavindh, Nizamabadmp-](https://telugustop.com/wp-content/uploads/2020/01/MP-Aravindh-Comments-On-KCR-AndAssaduddin-Owaisi.jpg)
కేసీఆర్ హిందువుల ఓట్లు లేకుండానే గెలిచారా అంటూ ప్రశ్నించారు.మజ్లిస్ పార్టీకి కేసీఆర్ ఓ తొత్తు అని విమర్శించారు.నిజామాబాద్ మేయర్ పదవిని ఎంఐఎంకు అప్పగించే ప్రయత్నాలు టీఆరెస్ చేస్తుండటాన్ని అరవింద్ తీవ్రంగా తప్పుబట్టారు.
![](https://telugustop.com/wp-content/themes/novapress-pro/tstop/img/sharingcaring.png)
![Follow Us on Facebook Follow Us on Facebook](https://telugustop.com/img/social-icons/facebook.png)
![Follow Us on WhatsApp Follow Us on WhatsApp](https://telugustop.com/img/social-icons/whatsapp1.png)
![Follow Us on Twitter Follow Us on Twitter](https://telugustop.com/img/social-icons/twitter.png)
తాజా వార్తలు