భారత జట్టుకు చెందిన కొంత మంది సీనియర్ ఆటగాళ్లు ( Senior players )ఐపీఎల్ మోజులో పడి దేశవాళి క్రికెట్ ను చాలా నిర్లక్ష్యం చేస్తున్నారని బీసీసీఐ సీనియర్ ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.ఇకపై క్రికెట్ ఆటగాళ్లు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు చేస్తే సహించేది లేదని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా భారత క్రికెట్ బోర్డు ఎంత ఆదరణ పొందుతుందో అందరికీ తెలిసిందే.అయితే కొంతమంది దేశవాళీ రంజీ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్లను నిర్లక్ష్యం చేస్తూ, ఐపీఎల్ మ్యాచ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
దీంతో బీసీసీఐ ఇందుకు సంబంధించి సరికొత్త నిబంధనలను జారీ చేసింది.
దేశవాళీ మ్యాచులు ఆడితేనే ఐపీఎల్ లో ఆడేందుకు అనుమతి ఇస్తామని బీసీసీఐ హుకుం జారీ చేసింది.
ఇది భారత జట్టులో చోటు లేని, భారత జట్టుకు దూరంగా ఉన్న క్రికెటర్ల అందరికీ వర్తిస్తుంది.భారత జట్టులో చోటు దక్కించుకోవడం కోసం రంజీ ట్రోఫీ క్రికెట్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చి, ఆ తర్వాత రంజీ ట్రోఫీని ( Ranji Trophy )చులకనగా చూడడాన్ని బీసీసీఐ తీవ్రంగా పరిగణించింది.

ఇషాన్ కిషన్ జార్ఖండ్( Ishan Kishan Jharkhand ) తరపున రంజీ ట్రోఫీ మ్యాచ్లు ఆడకుండా బరోడా లోని రిలయన్స్ క్రికెట్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా( Captain Hardik Pandya ) తో కలిసి ప్రాక్టీస్ చేయడాన్ని బీసీసీఐ తీవ్రంగా పరిగణించింది.దక్షిణాఫ్రికా పర్యటన నుంచి ఇషాన్ కిషన్ అర్ధాంతరంగా స్వదేశానికి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే.భారత జట్టు చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ దేశవాళీ క్రికెట్ ఆడాలని ఇషాన్ కిషన్ ను సూచిస్తే అతను పట్టించుకోకపోవడం బీసీసీఐకి ఆగ్రహాన్ని తెచ్చింది.

ఇషాన్ కిషన్ 2024 ఐపీఎల్ ఆడాలంటే కచ్చితంగా మూడు నుంచి నాలుగు రంజీ మ్యాచులు ఆడాల్సిందే.ఇక బీసీసీఐ ఈ హుకుం జారీ చేయడంతో ఇషాన్ కిషన్ వెంటనే బరోడా వదిలి తన హోం టీం జార్ఖండ్ కు వచ్చేసాడు.రాజస్థాన్ తో జరిగే రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు.
ఇషాన్ కిషన్ తో పాటు రాజస్థాన్ ఆల్రౌండర్ దీపక్ చాహర్, బరోడా కెప్టెన్ కృణాల్ పాండ్యా, ముంబై మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లాంటి సీనియర్ ఆటగాళ్లంతా రంజిత్రోఫీలో ఆడేందుకు సిద్ధమయ్యారు.







