వన్డే వరల్డ్ కప్ వేదికల కేటాయింపులలో బీసీసీఐపై పలు రాష్ట్రాల మండిపాటు..!

బీసీసీఐ వన్డే వరల్డ్ కప్( One Day World Cup ) షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

అయితే బీసీసీఐ( BCCI ) కేవలం 10 వేదికలలో మాత్రమే మ్యాచులు నిర్వహిస్తూ ఉండడంతో పలు రాష్ట్రాల క్రికెట్ బోర్డులు చాలా అసంతృప్తిగా ఉన్నాయి.

వరల్డ్ కప్ వేదికలకు అవకాశాలు దక్కని రాష్ట్రాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.బీసీసీఐ ఏ లెక్కన వేదికలను సెలెక్ట్ చేసిందో అర్థం కావడం లేదని కొంతమంది బిజెపి ప్రభుత్వం కక్షపూరితంగా తమ రాష్ట్ర వేదికలకు మ్యాచులు రానివ్వలేదని ఆరోపిస్తున్నారు.

బీసీసీఐ తమపై పూర్తిగా వివక్ష చూపిందని పలు స్టేడియాల నిర్వహకులు ఆరోపిస్తున్నారు.ఐసీసీ ఏ టోర్నీలో అయినా ఎన్ని వేదికలలో మ్యాచులు నిర్వహించాలి అనే బాధ్యత టోర్నీ నిర్వహించే బోర్డు కే అప్పగిస్తుంది.

టోర్నీను ఎన్ని వేదికలపై నిర్వహించాలి అనేది ఆ టోర్నీ నిర్వహించే బోర్డ్ చేతిలోనే ఉంటుంది.కాకపోతే టోర్నీ నిర్వహించే వేదికలు( Cricket Stadiums ) తక్కువగా ఉంటే లాజిస్టిక్స్ ఖర్చు మిగులుతుంది అంతే.

Advertisement

గతంలో జరిగిన టోర్నీలను ఒకసారి గమనిస్తే 2019లో ఇంగ్లాండ్లో వన్డే వరల్డ్ కప్ జరిగింది.ఇంగ్లాండ్ పెద్ద దేశం కాకపోయినా అక్కడ 11 స్టేడియాలలో మ్యాచ్లను నిర్వహించారు.

అంతేకాకుండా 2015 లో ఆస్ట్రేలియాలో నిర్వహించిన వరల్డ్ కప్ విషయానికి వస్తే.

ఏకంగా 14 వేదికలలో టోర్నీ మ్యాచ్లు నిర్వహించారు.పైన చెప్పిన దాని ప్రకారం భారత్లో జరగబోయే వన్డే వరల్డ్ కప్ కు కనీసం 15 వేదికలను బీసీసీఐ ఏర్పాటు చేస్తుందని అందరూ భావించారు.కానీ బీసీసీఐ కొన్ని రాష్ట్రాల క్రికెట్ బోర్డులకు వివక్ష చూపిస్తూ కేవలం 10 వేదికలను మాత్రమే సెలెక్ట్ చేసింది.

ఈ విషయంలో ఇండోర్ వంటి వేదికలను కూడా బీసీసీఐ పక్కన పెట్టేసింది.దీంతో మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అభిలాష్ ఖండేకర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

రజినీకాంత్ ను టార్గెట్ చేసిన స్టార్ డైరెక్టర్లు...
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 1, శనివారం, 2021

ఇండోర్లో 1987లో ఆస్ట్రేలియా- న్యూజిలాండ్ మధ్య వరల్డ్ కప్ మ్యాచ్ జరిగింది.అలాంటి వేదికపై వివక్ష చూపించడం సరికాదని కొందరు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.తరువాత తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణకు మాత్రం మూడు మ్యాచ్లను కేటాయించారు.

Advertisement

అక్టోబర్ 6న పాకిస్తాన్- క్వాలిఫయర్-1, అక్టోబర్ 9న న్యూజిలాండ్- క్వాలిఫయర్-1, అక్టోబర్ 12న పాకిస్తాన్-క్వాలిఫయర్-2 మ్యాచ్లు జరగనున్నాయి.ఇక ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఒక్క మ్యాచ్ ను కూడా కేటాయించలేదు.

తాజా వార్తలు