IPL 2024 Matches : క్రికెట్ అభిమానులకు బీసీసీఐ ఊహించని షాక్.. ఐపీఎల్ సెకంఢాఫ్ మ్యాచ్లు విదేశాల్లో..!

భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండడంతో ఐపీఎల్ సెకండ్ హాఫ్ మ్యాచ్లను స్వదేశంలో కాకుండా విదేశాల్లో నిర్వహించాలని బీసీసీఐ( BCCI ) నిర్ణయం తీసుకుంది.

బీసీసీఐ ఇప్పటికే 22 మ్యాచ్ల షెడ్యూల్ ను ప్రకటించింది.

భారతదేశంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ అనంతరం మిగతా మ్యాచ్లు వివరాలను వెల్లడించాలనుకుంది.అయితే ఎన్నికల షెడ్యూల్( Election Schedule ) మార్చి 16వ తేదీ అంటే నేడు వెలువడనున్నాయి.

ఎన్నికలు దశలవారీగా జరగనుండడంతో సెకండాఫ్ మ్యాచులను విదేశాల్లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.దీనిపై పూర్తిగా స్పష్టత రావాలంటే అధికారిక ప్రకట రావాల్సి ఉంది.

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే, బీసీసీఐ ఐపీఎల్ 2024 టోర్నీ గురించి కీలక ప్రకటన చేయనుంది.

Advertisement

ఐపీఎల్ సెకండ్ హాఫ్ మ్యాచ్లను భారత్ లో ఎన్నికలు లేని నగరాలలో నిర్వహించాలని బీసీసీఐ మొదట భావించింది.కానీ సార్వత్రిక ఎన్నికలు ఒకేసారి కాకుండా పలు దశల్లో నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయించడం వల్ల సెకండాఫ్ మ్యాచులు భారత్ లో నిర్వహించడం వీలు కాదని బీసీసీఐ అభిప్రాయపడుతోంది.అంతేకాదు భారత్లో ఎన్నికల సమయంలో ఐపీఎల్ మ్యాచ్లకు సెక్యూరిటీ ఇవ్వలేదని ఆయా రాష్ట్రాల పోలీస్ శాఖలు తెలియజేయడంతో బీసీసీఐ సెకండాఫ్ మ్యాచులను విదేశాల్లో నిర్వహించడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చింది.

బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఐపీఎల్ మ్యాచ్లను( IPL Matches ) ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని భారత అభిమానులు కోల్పోనున్నారు.బీసీసీఐ ప్రకటించిన ఫస్టాఫ్ షెడ్యూల్లో మార్చి 22 నుంచి ఏప్రిల్ ఏడవ తేదీ వరకు మ్యాచులు జరుగుతాయి.చెన్నై వేదికగా మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్ తో ఐపీఎల్ 2024 టోర్నీ ప్రారంభం అవ్వనుంది.

Advertisement

తాజా వార్తలు