బసవతారకమ్మ కోరిక కోసం ఎన్టీఆర్ చేసిన పనేంటో తెలుసా ?

ఎన్టీఆర్….తెలుగుజాతి ఆణిముత్యం.

 Basavatharakam Wish To Join Ntr In Politics  , Basavatharakam , Sr Ntr, Politics-TeluguStop.com

సాదాసీదా వ్యక్తిగా నిమ్మకూరులో జన్మించిన ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రత్యేకగా మారాడు అంటే దాని వెనక ఆయన కృషి, పట్టుదల, క్రమశిక్షణ ఎంత ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు.సినిమాల్లో తిరుగులేని హీరోగా ఎన్నో ఏళ్ల పాటు ఏకచత్రాధిపత్యం చేసిన ఎన్టీఆర్ 60 ఏళ్ల వయసు వచ్చేసరికి సామాజిక సేవ పైన దృష్టి పెట్టాలని భావించారు.

మరికొన్ని రోజుల్లో 60వ పుట్టినరోజు దగ్గరికి వస్తున్న నేపథ్యంలో విలేకరులకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఎన్టీఆర్.దాంట్లో ఇకపై మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు గాను 60 సంవత్సరాల తర్వాత తన నెలలో ప్రతి 15 రోజులు ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడతానని ప్రకటించారు ఎన్టీఆర్.

అది ఆయన్ని రాజకీయాల్లోకి తీసుకురావడానికి నాంది అయింది అని చెప్పాలి.1981 వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పతాక స్థాయికి చేరాయి.మన ముఖ్యమంత్రిని ఢిల్లీలో అవమానించడంతో తెలుగు జాతి గుండె రగిలిపోయింది.కాంగ్రెసేతర పార్టీ మన రాష్ట్రంలో అప్పటివరకు అధికారంలో లేకపోవడంతో ఆత్మగౌరవం అనే నినాదం అప్పటినుంచి పుట్టింది.వాస్తవానికి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనే కోరిక మొదటినుంచి లేదట.అతడి భార్య బసవతారకమ్మ ఎన్టీఆర్ ని ఒక కోరిక కోరారట.

తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కి ఇంతటి అన్యాయం జరగడం ఎంతవరకు సబబు అందుకే మీరు రాజకీయాల్లోకి రావాలి అంటూ బసవతారకం అమ్మ ఎన్టీఆర్ ని అడిగారట.

అలా మొదటిసారిగా రాజకీయాల గురించి సీరియస్ గా ఆలోచించడం మొదలుపెట్టారట ఎన్టీఆర్.సర్దార్ పాపారాయుడు షూటింగ్ పూర్తవగానే ఆయన రాజకీయాల్లోకి రావాలనే ప్రకటన కూడా చేశారు. చైతన్య రథం అనే నినాదంతో రాష్ట్రమంతా కలియతిరిగారు ఎన్టీఆర్.

కేవలం పార్టీ పెట్టి దానికి తెలుగుదేశం అనే పేరు పెట్టి తొమ్మిది నెలల సమయం ఉండగా ఎన్నికల కోసం ఆయన ప్రజా సమస్యలు తెలుసుకోవాలని చైతన్య రథంతో వేల కిలోమీటర్లు ప్రయాణం చేశారు.అలా ప్రజాదారణను కూడబెట్టుకుని తొమ్మిది నెలల సమయంలోనే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు.

ఆలా మొత్తానికి భార్య కోరిక మేరకు రాజకీయాల్లోకి వచ్చి సీఎం అయినప్పటికీ అయన జీవితం ముగిసిన తీరు ఎంతో బాధాకరమని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube