Barber Hair Cut : నిరాశ్రయుడికి ఉచితంగా హెయిర్ కట్ చేసిన బార్బర్.. అదిరిపోయే లుక్!

సాధారణంగా హోమ్ లెస్ పీపుల్ మాసిన బట్టలతో, చింపిరి జుట్టుతో కనిపిస్తుంటారు.వీరి దగ్గర డబ్బు కూడా అంత ఎక్కువగా ఉండదు.

స్నానాలు చేయడానికి, చక్కగా కనిపించడానికి ఎలాంటి సౌకర్యాలు లేక ఎంతో ఇబ్బందులు పడుతుంటారు.కానీ వీరిలో కూడా బ్యూటీ ఉంటుందని చాలా తక్కువ మంది మాత్రమే గుర్తిస్తారు.

ఆ తక్కువ మంది వీరిని చేరదీసి వారి లుక్కే మార్చేస్తుంటారు.కాగా తాజాగా ఒక బార్బర్ క్షవరం చేసుకోవడానికి కూడా డబ్బులు లేక చాలా అందవిహీనంగా కనిపిస్తున్నా ఒక వ్యక్తికి ఉచితంగా హెయిర్ కట్ చేశాడు.

దాంతో ఆ నిరాశ్రయుడికి లుక్ ఒకసారిగా మారిపోయింది.ఒక నిరాశ్రయుడికి తాను ఫ్రీగా హెయిర్ కట్ చేసినట్లు ఈ బార్బర్‌ వెల్లడిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో కూడా పెట్టాడు అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.

Advertisement

దీన్ని చూసిన నెటిజన్లు ఆ బార్బర్ మంచి హృదయాన్ని పొగుడుతున్నారు.ఎంపవరింగ్ కట్స్‌ సెలూన్ షాప్ లో పనిచేస్తున్న జోషువ శాంటియాగోలో స్ట్రీట్‌లో నిరాశ్రయుడిని చూసి చలించిపోయాడు.

తాను హెయిర్ కట్ చేస్తే అతడు చాలా అందంగా కనిపిస్తాడని గ్రహించాడు.ఆపై అతడికి అట్రాక్టివ్ మేకోవర్ ఇచ్చాడు.

వైరల్‌ అవుతున్న వీడియోలో ఒక సెలూన్‌లోని ఛైర్‌లో ఓ వ్యక్తి కూర్చుని ఉండగా అతడికి హెయిర్ కట్ చేస్తుండటం ఈ వీడియోలో కనిపించింది.జుట్టు చక్కగా కత్తిరించిన తర్వాత ఈ వ్యక్తి 20 ఏళ్లు చిన్నగా కనిపించడంతో అందరూ అవాక్కవుతున్నారు.ఈ వీడియోని మీరు కూడా తిలకించండి.

ఐపీల్ పేరుతో విధ్వంసం...ఇదంతా స్వయంకృపరాధమే.. ఇంకా ఎన్ని చూడాలో !
Advertisement

తాజా వార్తలు