ఇదేం పద్దతి..ట్రంప్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఒబామా..!!

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడి రాజుకుంటోంది.రోజు రోజుకి అధికార పార్టీ పై డెమోక్రటి పార్టీ అధినేతలు, సీనియర్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

ట్రంప్ ఏ తప్పు చేసినా ఓ రేంజ్ లో ఎండగడుతున్నారు.ట్రంప్ సైతం చిన్న చిన్న తప్పులు చేస్తూ మీడియా కి ప్రతిపక్ష పార్టీకి అడ్డంగా దొరికి పోతున్నారు.

తుల్సా, ఆరిజోనా లో ట్రంప్ గత నెలలో ఎన్నికల ర్యాలీ ని చేపట్టిన సమయంలో కరోనా వైరస్ కి కొత్త పేరు పెట్టనని దాని పేరు “కుంగ్ ఫ్లూ” అంటూ ప్రకటించిన విషయం విధితమే.అయితే ఈ విషయంపై ఒమాబా స్పందించారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ట్రంప్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ట్రంప్ ఆసియా వ్యతిరేక సెంటిమెంట్ ని రెచ్చగొట్టే విధంగా ప్రయత్నిస్తున్నారని, ట్రంప్ ఈ విషయంలో సరదా అంటూనే తీవ్ర ఆందోళనలు రేపే విధంగా మాట్లాడుతున్నారని ఒబామా మండిపడ్డారు.

Advertisement

స్థానిక మీడియా కధనం ప్రకారం.అధ్యక్షుడు ట్రంప్ కరోనా వైరస్ ని కుంగ్ ఫ్లూ అనే పదంతో పోల్చడం ఆసియా వ్యతిరేక భావనను రెచ్చగొట్టే విధంగా ఉందని ఈ విషయంలో ట్రంప్ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారని ఒక దేశాధ్యక్షుడుగా ఇలాంటి వ్యాఖ్యలు ట్రంప్ కి తగదని ఒబామా ఘాటుగానే స్పందించారు.

కుంగ్ ఫ్లూ అనే పదాన్ని కామెడీగా తీసుకునే దేశాన్ని నేను కోరుకోనని ఆయన ఆవేదనగా చెప్పినట్టు మీడియా పేర్కొంది.ఇదిలాఉంటే ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో డెమోక్రటి పార్టీ సీనియర్ నేత అయిన ఒబామా ప్రస్తుతం అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న బిడెన్ ఎన్నికల నిధుల కోసం ప్రచారం చేపట్టారు.ఈ క్రమంలోనే ట్రంప్ వ్యవహార తీరుపై స్పందించారని తెలుస్తోంది.

అయితే ఇప్పటికే ఎంతో మంది ఆసియన్ అమెరికన్స్ పై వేధింపులు మొదలైనట్టుగా మీడియా ప్రకటించింది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు