ఈ చిట్టిపొట్టి పక్షి నాన్‌స్టాప్‌గా 13,560 కిలోమీటర్లు పయనించి రికార్డులు కొట్టేసింది!

ఓ చిన్న పక్షి నాన్‌స్టాప్‌గా 13,560 కిలోమీటర్లు పయనించడమేమిటి అని అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే.ఇది నమ్మలేని నిజం.

 Bar-tailed Godwit Bird Sets World Record With 13560km Continuous Journey Details-TeluguStop.com

రాక్షస పక్షులు కూడా చేయలేని రికార్డును సాధించింది ఓ చిన్న పక్షి.బార్-టెయిల్డ్ గాడ్‌విట్ అని పిలువబడే ఈ పక్షి.

నీరు ఉన్న ప్రాంతంలో ఎక్కువగా తారసపడుతూ ఉంటుంది.ఈ పక్షి ఏకంగా ఉత్తర అమెరికాలోని అలస్కా నుంచి ఆస్ట్రేలియాలోని టాస్మానియా వరకు అలసిపోకుండా, అంటే ఎక్కుడా కూడా రెస్ట్ తీసుకోకుండా నాన్ స్టాప్‌గా పయనించింది.

ఈ క్రమంలో 13,560 కిలోమీటర్లు చక్కెర్లు కొట్టేసింది.

శాటిలైట్ ట్యాగింగ్ నెంబర్ 234684 ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది ఈ చిట్టిపొట్టి పక్షి.

ఇక్కడ చెప్పుకోదగ్గ మరో విషయం ఏమంటే, ఇంత దూరం ఆ పక్షి 11 రోజులు వ్యవధిలో సీఖుట్టేసింది.అలాగే దీని వయసు కూడా కేవలం 5 నెలలు మాత్రమే.

శాస్త్రవేత్తలు 5G ఉపగ్రహ ట్యాగ్‌ ఏర్పాటు చేసి దాని కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.కాగా శాస్త్రవేత్తలు ఈ పక్షికి “లిమోసా లాపోనికా” అని పేరు పెట్టారు.

ఈ చిన్న జీవి అలాస్కా నుండి బయలుదేరి.ఆస్ట్రేలియాలో అన్సాన్స్ బేకు ఈశాన్యంగా ఉన్న టాస్మానియాలో దిగింది.

Telugu Km Journey, Alaska, Bar Godwit Bird, Bird, Godwit Bird, Satellite, Tasman

ఇకపోతే ఇంతకు ముందు ఈ ప్రపంచ రికార్డ్ అదే జాతికి చెందిన 4BBRW మగ పక్షి పేరిట ఉండగా ఇపుడు దానిని ఇది అధిగమించింది.4BBRW మగ పక్షి నాన్‌స్టాప్‌గా 13,000 కిలోమీటర్లు పయనించింది.ఇక డికంటే ముందు విక్రమార్కుడు అనే పక్షి 12,000 కిలోమీటర్లు పయనించి రికార్డ్ సృష్టించగా తాజాగా ‘లిమోసా లాప్పోనికా’ 4BBRW మగ బర్డ్ రికార్డ్‌ను స్మాష్ చేసింది.గాడ్విట్ ఒక వలస పక్షి.

హవాయికి పశ్చిమాన ప్రయాణించి, మహాసముద్రాల మీదుగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube