తండ్రి కూలీ.. ఇంటర్ లో 993 మార్కులు సాధించిన కూతురు అంజలి.. గ్రేట్ అంటూ?

ఇంటర్ పరీక్షలలో 993 మార్కులు సాధించడం సులువైన విషయం కాదనే సంగతి తెలిసిందే.

అయితే తెలంగాణకు చెందిన అంజలి( Anjali ) అనే విద్యార్థిని మాత్రం ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఇంటర్ పరీక్షలో( Inter Exams ) 993 మార్కులు సాధించి సత్తా చాటారు.

తండ్రి కూలి పని చేస్తూ అంజలిని చదివించడం గమనార్హం.మారుమూల గిరిజన బిడ్డ అయిన అంజలి ఇంటర్ లో రాష్ట్ర స్థాయిలో సత్తా చాటడంతో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

భద్రాద్రి జిల్లా సూరారం గ్రామానికి చెందిన బాణోతు అంజలి సక్సెస్ స్టోరీ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.రెండెకరాల పొలంలో వ్యవసాయం( Agriculture ) చేస్తూ కూలి పనులు చేస్తూ తల్లీదండ్రులు అంజలిని చదివించగా ఆమె ఎంతో కష్టపడి చదివి పోటీ పరీక్షలలో సత్తా చాటారు.

బాల్యం నుంచి అంజలి చదువులో చురుకుగా ఉండేవారని తెలుస్తోంది.స్వగ్రామంలోనే అంజలి ఐదో తరగతి వరకు చదువుకున్నారు.

Advertisement

జ్యోతిరావు పులే గురుకుల విద్యాలయంలో( Jyothirao Phule Gurukul School ) పదో తరగతి వరకు చదివిన అంజలి ఖమ్మంలోని శ్రీచైతన్య జూనియర్ కాలేజ్ లో చేరారు.ఇంటర్ ఫస్టియర్ లో 466 మార్కులు సాధించిన అంజలి సెకండ్ ఇయర్ మరింత కష్టపడి చదివి 1000 మార్కులకు 993 మార్కులు సాధించారు.అంజలి కెరీర్ పరంగా మరింత ఎదగాలని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

అంజలి ఒక్కో మెట్టు ఎదిగి ఈ స్థాయికి చేరుకోవడంపై నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అంజలి తల్లీదండ్రులను సైతం నెటిజన్లు ఎంతగానో ప్రశంసిస్తున్నారు.అంజలి భవిష్యత్తులో మంచి ఉద్యోగం సాధించి తల్లీదండ్రులను బాగా చేసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

అంజలికి ఆర్థికంగా కొంతమేర సహాయసహకారాలు అందితే ఆమె ఉన్నత చదువులు సులువుగా అభ్యసించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.అంజలి రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకోనున్నారో తెలియాల్సి ఉందని సమాచారం అందుతోంది.

వీడియో: ట్రైన్ బోగీ మెట్లపై కూర్చున్న వ్యక్తి.. జారిపోవడంతో..?
Advertisement

తాజా వార్తలు