బంగ్లాదేశ్ చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ఘోరఓటమి.. బోణి కొట్టిన బంగ్లాదేశ్..!

తాజాగా శ్రీలంక వేదికగా జరిగిన ఆసియా కప్ టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్-ఆఫ్గనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. 89 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ ను చిత్తుగా ఓడించింది.

 Bangladesh Beat Afghanistan By 89 Runs , Afghanistan , Hossain Shanto, Asia Cu-TeluguStop.com

ఆసియా కప్ లో భాగంగా తన మొదటి మ్యాచ్లో బంగ్లాదేశ్( Bangladesh )జట్టు శ్రీలంక చేతిలో అత్యంత దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే.తాజాగా ఆదివారం జరిగిన మ్యాచ్ బంగ్లాదేశ్ కు డూ ఆర్ డై మ్యాచ్.

ఒకవేళ బంగ్లాదేశ్ ఈ మ్యాచ్లో ఓడిపోయి ఉంటే గనుక ఇక ఆసియా కప్ నుండి నిష్క్రమించాల్సి వచ్చేది.

బంగ్లాదేశ్ జట్టు ఆటగాళ్లు అటు బ్యాటింగ్ లోను.ఇటు ఫీల్డింగ్ లోను ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకొని ఆఫ్గనిస్తాన్ ఆటగాళ్లను చాలా కట్టడి చేశారు.టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 334 పరుగుల భారీ స్కోర్ చేసింది.

బంగ్లాదేశ్ జట్టులోని మిరాజ్ 112, హుస్సేన్ శాంటో 104( Hossain Shanto ) సెంచరీలతో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించారు.అయితే ఆఫ్ఘనిస్తాన్ ఫీల్డింగ్ లో లోపాలు ఉండడం వల్లే బంగ్లాదేశ్ భారీ పరుగులను చేయగలిగింది.

ఆఫ్ఘనిస్తాన్ ఫీల్డింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల అనవసర బౌండరీలు వచ్చాయి.

అనంతరం భారీ లక్ష్య చేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు బ్యాటర్లను ఆరంభం నుంచే బంగ్లాదేశ్ కట్టడి చేయడం వల్ల 44.3 ఓవర్లలో 10 వికెట్లను కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్ 245 పరుగులు చేసి ఓడింది.ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లైన ఇబ్రహీం జాద్రాన్ 75 పరుగులతో రాణించాడు.

జట్టు కెప్టెన్ హాష్మతుల్లా 51, రహ్మత్ షా 33, రషీద్ ఖాన్ 24 పరుగులు చేశారు.ఆఫ్ఘనిస్తాన్ రన్ రేట్ మెరుగ్గా ఉన్నప్పటికీ వికెట్లు కోల్పోవడం వల్ల ఓటమి తప్పలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube