రజిని సినిమా కోసం భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకున్న లోకేష్... సినిమానే చెయ్యొచ్చు!

కోలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో లోకేష్ కనగరాజ్ ( Lokesh Kanagaraj )ఒకరు.ఈయన దర్శకుడిగా సినిమాలు చేసింది కేవలం ఐదు సినిమాలు మాత్రమే.

 Kollywood Director Lokesh Kanagaraj Remuneration For Rajinikanth Movie Viral In-TeluguStop.com

అయితే ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో ఈయనకు కోలీవుడ్ ఇండస్ట్రీలో భారీ క్రేజ్ పెరిగిపోయింది.ఇక కమల్ హాసన్( Kamal Hassan ) హీరోగా నటించిన విక్రమ్ సినిమా( Vikram Movie )బ్లాక్ బస్టర్ ఆయన సంగతి మనకు తెలిసిందే.

ఈ సినిమా తర్వాత లోకేష్ తన తదుపరి చిత్రాన్ని హీరో విజయ్ తో లియో సినిమాని తెరకెక్కించారు.ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

Telugu Kollywood, Rajinikanth-Movie

ఈ సినిమా తర్వాత లోకేష్ తన తదుపరి సినిమాని సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth )తో చేయబోతున్నట్లు ప్రకటించారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నట్టు సమాచారం.ఇక తాజాగా రజనీకాంత్ సైతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో నటించిన జైలర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి పెద్ద ఎత్తున అభిమానులను ఆకట్టుకుంటుంది.

ఇలా ఈ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రజనీకాంత్ తన తదుపరి సినిమాని లోకేష్ దర్శకత్వంలో చేయబోతున్నారని తెలియగానే సినిమా పైనే భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

Telugu Kollywood, Rajinikanth-Movie

ఇక లోకేష్ రజనీకాంత్ తో సినిమా చేయడం కోసం భారీగానే రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని తెలుస్తుంది.ఈ సినిమా కోసం లోకేష్ తీసుకొని రెమ్యూనరేషన్ తో ఏకంగా ఓ సినిమానే చేయొచ్చునీ ఈయన రెమ్యునరేషన్ గురించి కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.మరి రజనీకాంత్ తో సినిమా చేయడం కోసం లోకేష్ కనగారాజ్ ఇంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే విషయానికి వస్తే ఈ సినిమా కోసం ఈయన ఏకంగా 60 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుబోతున్నట్టు సమాచారం.

తీసినది ఐదు సినిమాలే అయినా ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు అంటే ఈ డైరెక్టర్ కి ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో అర్థమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube