రంగారెడ్డి జిల్లా: నగర శివారు రాజేంద్రనగర్ బండ్లగూడ లోని కీర్తి రిచ్మండ్ విల్లాలో కోటి ఇరవై ఆరు లక్షలు పలికిన గణపతి లడ్డూ వేలం.హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనం వైభంగా కొనసాగుతుంది.
మరోవైపు గణనాథుడి లడ్డూల వేలం ప్రక్రియ కూడా జోరుగా సాగుతుంది.ఆది దేవుడైన గణపతి ప్రసాదాన్ని సొంతం చేసుకోవడానికి భక్తులు పోటీపడుతున్నారు.
ఇందుకోసం ఎంతైనా వెచ్చించడానికి వెనకాడటం లేదు.
తాజాగా హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విల్లాలో గణపతి లడ్డూ రికార్డు స్థాయి ధర పలికింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా.గణపతి లడ్డూ రూ.
కోటి 26 లక్షలు పలికింది.గతంలో కూడా ఈ గణపతి లడ్డూ రికార్డు ధర పలికిన సంగతి తెలిసిందే.గతేడాది ఇక్కడ గణపతి లడ్డూ రూ.60.80 లక్షలు పలికింది.అయితే ఈసారి మాత్రం అంతకు రెండింతలు ధర పలకడం గమనార్హం.2021లో కూడా ఇక్కడ గణపతి లడ్డూ రూ.41 లక్షలు పలికిందని చెబుతున్నారు.







