సినీ నటుడిగా, నిర్మాతగా గుర్తింపు పొందిన బండ్లగణేష్ గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు.గత మూడు రోజుల క్రితం వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బండ్ల గణేష్ మధ్య ట్విట్టర్ వార్ జరుగుతోంది.
కులం గురించి బండ్లగణేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇలా ఈ వివాదం ముగియకముందే బండ్లగణేష్ మరోసారి ట్విట్టర్ ద్వారా వైఎస్ విజయమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎవరూ ఊహించని విధంగా బండ్ల గణేష్ ఇలా వై.ఎస్.విజయమ్మకు శుభాకాంక్షలు తెలపడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు.
బండ్ల గణేష్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ మాతృ సమానులు శ్రీమతి వైయస్ విజయమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
మీరు ఎంతో ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఆయుష్షు ఇవ్వాలని ఆయురారోగ్య అభివృద్ధిరస్తు అంటూ బండ్ల గణేష్ వైఎస్ విజయమ్మకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ విధంగా బండ్ల గణేష్ శుభాకాంక్షలు తెలియజేయడంతో వైసీపీ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో జనసేన సైనికులు మాత్రం ఒక్కసారిగా షాక్ అవ్వడమే కాకుండా బండ్ల గణేష్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎప్పుడు పవన్ కళ్యాణ్ నామస్మరణ చేసే బండ్ల గణేష్ ఇలా వైఎస్ విజయమ్మకు శుభాకాంక్షలు చెప్పడం ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు.నీ నుంచి ఇలాంటివి ఊహించలేదు బండ్లన్న అంటూ జనసైనికులు ఏకిపారేస్తున్నారు.వైసీపీ అభిమానులు మాత్రం మాతృ సమానురాలు అంటూ ఎక్కడో టచ్ చేసావ్ సోదరా అంటూ బండ్ల గణేష్ ట్వీట్ పై కామెంట్లు పెడుతున్నారు.