పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే థియేటర్ల వద్ద ప్రీ రిలీజ్ వేడుకలో సందడి ఏ రేంజిలో ఉంటుందో మనందరికీ తెలిసిందే.పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన బండ్ల గణేష్ హడావిడి కూడా ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే.
పవన్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువగా బండ్ల గణేష్ స్పీచ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు.పవన్ కళ్యాణ్ కు బండ్ల గణేష్ వీరాభిమాని అన్న విషయం తెలిసిందే.
పవన్ సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ పై ఇచ్చే స్పీచ్ వింటే అతనికి పవన్ కళ్యాణ్ అంటే ఎంత అభిమానమో అర్థమవుతుంది.
అంతలా పవన్ కళ్యాణ్ ని ఆరాధిస్తుంటారు.
ప్రేమిస్తుంటాడు.మరీ ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ స్పీచ్ లతో పోల్చుకుంటే ఎక్కువగా బండ్ల గణేష్ స్పీచ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ ఉంటాయి.
అంతే కాకుండా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురుచూసేది కూడా బండ్ల గణేష్ స్పీచ్ కోసమే.పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను నిర్వహించారు చిత్రబృందం.ఈ ఈవెంట్ లో బండ్లగణేష్ కనిపించకపోవడంతో పవన్ అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో, ట్విట్టర్ లో, యూట్యూబ్ లో బండ్లన్న అంటూ కామెంట్ ల మోత మ్రోగిస్తున్నారు.ఎక్కడ ఉన్నావు బండ్లన్న.
నువ్వు రావాలి బండ్లన్న అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
దీనికి తోడు భీమ్లా నాయక్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు బండ్ల గణేష్ ను త్రివిక్రమ్ అడ్డుకున్నారు అన్న వార్తలు చక్కర్లు కొడుతున్నడంతో.అభిమానులు బండ్ల గణేష్, త్రివిక్రమ్ పై మీమ్స్ క్రియేట్ చేసి వదులుతున్నారు.అంతేకాకుండా ఈశ్వర.
పవనేశ్వరా.పవనేశ్వరా.
.మా బండ్లన్న ఎక్కడ దేవరా.అంటూ పవన్ భక్తుడి పై ప్రశ్నలు సంధిస్తున్నారు.ఇక పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాకు స్పీచ్ తో హైలెట్ అయ్యే బండ్ల గణేష్ ఈ సారి ఈవెంట్ కు రాకుండానే, స్పీచ్ ఇవ్వకుండానే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచాడు.
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా బండ్లన్న నామస్మరణతో మార్మోగిపోతోంది.ఇకపోతే పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25 న విడుదల కానున్న విషయం తెలిసిందే.