సినీ నిర్మాత బండ్ల గణేశ్( Bandla Ganesh ) కు చెక్ బౌన్స్ కేసులో జైలుశిక్ష పడింది.ఏడాది పాటు జైలుశిక్ష మరియు రూ.95 లక్షలు చెల్లించాలని ఒంగోలు కోర్టు( Ongole court ) ఆదేశాలు జారీ చేసింది.దాంతో పాటు కోర్టు ఫీజు కింద మరో రూ.10 లక్షలు చెల్లించాలని న్యాయస్థానం తీర్పును వెలువరించింది.30 రోజుల్లో బండ్ల గణేశ్ హైకోర్టులో అప్పీల్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.
అయితే ప్రకాశం జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు ( venkateshwarlu )అనే వ్యక్తి దగ్గర పరమేశ్వర ఫౌల్ట్రీ పరిశ్రమ కోసం రూ.95 లక్షలను బండ్ల గణేశ్ అప్పుగా తీసుకున్నారు.దాదాపు నాలుగేళ్లు అయినా అప్పు తిరిగి చెల్లించకపోవడంతో బాధితుడు కోర్టును ఆశ్రయించారు.ఈ కేసుపై పలు దఫాలుగా విచారణ జరిపిన న్యాయస్థానం ఇవాళ తుది తీర్పును వెలువరించింది.నెల రోజుల లోపు బాధితుడికి రూ.95 లక్షలు చెల్లించాలన్న కోర్టు బండ్ల గణేశ్ కు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది.