టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోను సవరించాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కరీంనగర్ బీజేపీ కార్యాలయంలో చేపట్టిన జాగరణ దీక్ష రసాభాసగా మారిన సంగతి తెలిసిందే.కరోనా నిబంధనలు పాటించలేదని బండి సంజయ్ తో పాటు మరికొంత మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.
ఈ పరిణామంతో మూడు రోజుల పాటు బండి సంజయ్ జైల్లోనే ఉన్నారు.ఇటువంటి తరుణంలో బండి సంజయ్ బెయిల్ పిటిషన్ హైకోర్టులో వేయగా.
తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే.ప్రారంభంలో సెషన్ కోర్టు.
బెయిల్ నిరాకరించిన తర్వాత హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్.వేయటంతో అత్యవసర విచారణ చేపట్టిన క్రమంలో న్యాయస్థానం.
విచారణ జరిపి బెయిల్ ఇవ్వడం జరిగింది.
దీంతో జైలు నుండి విడుదలైన తర్వాత మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకునే కేసీఆర్ ని వదిలే ప్రసక్తే లేదని.వేల కోట్లు దోచుకున్న అవినీతి కుబేరుడు గా మారారని మండిపడ్డారు.ప్రజా సమస్యల విషయంలో ప్రశ్నిస్తే జైలుకు పంపుతున్నారని సీరియస్ అయ్యారు.తెలంగాణలో టిఆర్ఎస్ అధికారంలో ఉంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని గుర్తుంచుకోవాలని.
కేసీఆర్ కి తనదైన శైలిలో బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు.అంత మాత్రమే కాక 317 జీవోను సవరించాలని మరోసారి ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు.
ఉపాధ్యాయులు మరియు ఉద్యోగుల కోసమే తాను జైలుకు వెళ్లినట్లు అవసరమైతే మళ్లీ జైలుకు వెళ్తానని.బండి సంజయ్ పేర్కొన్నారు.కరోనా నిబంధనలు పాటిస్తూ దీక్ష చేస్తుంటే.దీక్ష భగ్నం చేశారని తమ కార్యాలయాన్ని అదేరీతిలో కార్యకర్తలపై దాడి జరిగిందని దుయ్యబట్టారు.
తనను అరెస్టు చేసి కేసీఆర్ రాక్షసానందం పొందుతున్నారని.బండి సంజయ్ పేర్కొన్నారు.
ప్రజా సమస్యల విషయంలో పోరాడి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా చేస్తామని.ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.