బండి సంజయ్ ప్లాన్.. అదుర్స్ !

తెలంగాణ( Telangana ) బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay ) మాస్టర్ ప్లాన్ వేశారా ? మరుగున పడిన అంశాన్ని మళ్ళీ తెరపైకి తెచ్చి కొత్త చర్చలకు తావిస్తున్నారా ? అంటే అవుననే అభిప్రాయాలూ వ్యక్తమౌతున్నాయి.గతంలో ఆయన అధ్యక్ష పదవిలో కొనసాగినంతా కాలం రాష్ట్రంలో పార్టీని జెట్ స్పీడ్ తో ముందుకు నడిపించారు.

 Bandi Sanjay Plan Adurs , Bandi Sanjay, Telangana, Etela, Etela Rajender, Bjp,-TeluguStop.com

కానీ ఊహించని విధంగా ఆయనను అద్యక్ష పదవి నుంచి అధిష్టానం తప్పించిన తరువాత.ఆయనలో మునుపటి స్పీడ్ కరువైంది.

అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెబుతూ వచ్చిన బండి సంజయ్.లోలోపల మాత్రం అధ్యక్షపదవి దూరమైనందుకు తీవ్ర అసహనంతో ఉన్నారని గత కొన్నాళ్లుగా గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి.

వాటికి తగ్గట్టుగానే ఆయన కూడా పార్టీ వ్యవహారాల విషయంలో అంటి అంతనట్టుగానే వ్యవహరిస్తూ వచ్చారు.

Telugu Bandi Sanjay, Etela, Etela Rajender, Telangana-Politics

కాగా సి‌ఎం అభ్యర్థి గా బండి ని ప్రకటించేందుకే అధ్యక్ష పదవి నుంచి తప్పించరనే వాదన కూడా బలంగానే వినిపిస్తూ వచ్చింది.అయితే సి‌ఎం అభ్యర్థి విషయంలో కూడా బండికి ఈటెల( etela ) ద్వారా గట్టి పోటీ నెలకొంది.బీసీ నేతల్లో ఎవరో ఒకరిని సి‌ఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని బీజేపీ అధిష్టానం చెప్పడంతో.

బీసీలుగా ఉన్న బండి సంజయ్, ఈటెల రాజేందర్ సి‌ఎం అధ్యక్ష రేస్ లో ఉన్నట్లు వాదన నడుస్తోంది.కాగా ఇటీవల బీజేపీ( BJP ) అధిష్టానం ఈటెల రాజేందర్ కు ఎక్కువ ప్రదాన్యం ఇస్తూ వస్తోంది.

దాంతో సి‌ఎం అభ్యర్థిగా ఈటెలను ప్రకటిస్తారనే భయం బండిని వెంటాడుతున్నట్లు తెలుస్తోంది.

Telugu Bandi Sanjay, Etela, Etela Rajender, Telangana-Politics

అందుకే పార్టీలో తన పాత్రపై అధిష్టానానికి తెలిసేలా చురకలాంటిస్తున్నారు బండి సంజయ్.అందులో భాగంగానే ఇంతవరకు అధ్యక్ష పదవి విషయంలో స్పందించని బండి.తాజాగా స్పందిస్తూ పోలిటికల్ హీట్ పెంచుతున్నారు.

తనను అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారని ఊహించలేదని, పార్టీకి తాను ఎంతో చేశానని అయినప్పటికి తనపై వేటు పడిందని బండి వ్యాఖ్యానించారు.అంతే కాకుండా తనకు అధ్యక్ష పదవి మళ్ళీ ఇస్తే నిరాకరిస్తానని చెప్పి కొత్త చర్చకు తావిచ్చారు.

అయితే తెలంగాణలో బీజేపీని బలపరిచిన తనకు అధ్యక్ష పదవి విషయంలో అన్యాయం జరిగిందని.అందుకే సి‌ఎం అభ్యర్థిగా తనకు ఛాన్స్ ఇవ్వాలని పరోక్షంగా అధిష్టానంపై బండి అలకపూనినట్లు కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.

అందుకే అధ్యక్ష పదవి విషయంలో తనకు జరిగిన అన్యాయాన్ని బండి సంజయ్ నొక్కి చెబుతున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube