బండి సంజయ్ మీ సంగ్రామ యాత్ర ఎవరి కోసం?: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

దేశంలో ఉన్న అన్ని మతాలు, కులాలకు సమానత్వం కల్పించి జాతి నిర్మాణం చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన రోజున మనువాదం పేరిట జాతిని విడగొట్టాలని రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ కి తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు.

 Bandi Sanjay For Whom Is Your Campaign Clp Leader Bhatti Vikramarka Comments Det-TeluguStop.com

తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ప్రజా సమస్యల పరిష్కారం కొరకై చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఈరోజు ఖమ్మం జిల్లా బోనకల్ మండలం కలకోట నుండి రాయనపేట, ఆల్లపాడు, గోవిందపురం గ్రామాల్లో పాదయాత్ర కొనసాగుతుంది.

ఈ సంధర్భంగా భట్టి మాట్లాడుతూ బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర దేశంలో లౌకిక వాదం లేకుండా చేయడానికి, భావ స్వేచ్ఛను హరించడానికి, ఫెడరల్ స్ఫూర్తిని విఘాతం కలిగించ డానికి చేస్తున్న యాత్ర గా ఉందని విమర్శించారు.అచ్చే దిన్ తీసుకువస్తానని అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ వంట గ్యాస్, డీజిల్, పెట్రోల్ నిత్యావసర వస్తువుల ధరలు పెంచి దేశ ప్రజలకు సచ్చే దిన్ తీసుకువచ్చాడని బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారా అని హెద్దేవా చేశారు.

సామాన్యులపై మోడీ సర్కార్ అనేక భారాలను మోపుతూ సంపన్నులకు 11 లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను మాఫీ చేసిందని ప్రజలకు పాదయాత్రలో బండి సంజయ్ కి వివరించే దమ్ము ఉందా అని సవాల్ విసిరారు.

Telugu Bandi Sanjay, Clpbhatti, Congress, Dr Br Ambedkar, Modi, Padayatra, Peopl

పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించకుండా కార్పొరేట్ సంస్థలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచడానికి మోడీ సర్కార్ పరోక్షంగా సహకరిస్తున్న విషయాలను పాదయాత్రలో ప్రజలకు చెబితే బండి సంజయ్ పాదయాత్రకు అర్థం ఉంటుందన్నారు.

ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, విదేశాల నుంచి నల్ల ధనం తీసుకొచ్చే ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేస్తామని మాయమాటలతో అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు అవుతున్నా వీటిని అమలు చేయని మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా పాదయాత్ర చెయ్యాలి అన్నారు.ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ పేరిట మోడీ సర్కార్ అంబానీ ఆధానీలకు దారాదత్తం చేస్తూ.

ఉద్యోగుల ఉపాధిని దెబ్బ తీస్తుందని, భిన్నత్వంలో ఏకత్వం అయిన భారత దేశంలో భాష, మతం పేరిట విద్వేషాలను సృష్టిస్తున్న మోడీ సర్కార్ ను ప్రశ్నిస్తున్న వారిపై రాజద్రోహం కేసు పెట్టి అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన భావ స్వేచ్ఛను, బ్రతికే హక్కును బిజెపి ప్రభుత్వం హరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Telugu Bandi Sanjay, Clpbhatti, Congress, Dr Br Ambedkar, Modi, Padayatra, Peopl

ఫెడరల్ స్ఫూర్తికి ద్రోహం చేసే విధంగా దళిత, గిరిజన బలహీన వర్గాలను వెనుక బడేటట్లుగా చేసి మనువా దాన్ని ముందుకు తీసుకుపోవాలని బండి సంజయ్ చేపట్టిన సంగ్రామ యాత్ర పట్ల లౌకిక, ప్రజాస్వామ్య, ప్రగతిశీల శక్తులు, బుద్ధిజీవులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఎనిమిది సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను గాలికి వదిలేయడం వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజల బాధలను చూసి చలించి బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా నేను ప్రజాసమస్యల పరిష్కారం కొరకు పాదయాత్ర చేస్తున్నానని ప్రజలకు వివరించారు.

పాదయాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల పరిష్కారం కొరకు ప్రజా ఉద్యమాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచి పరిష్కారానికి కృషి చేస్తాం అని హామీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube