తెలంగాణలో బీజేపీ పరిస్థితి గతం కంటే బాగా మెరుగు పడింది.అధికారం దక్కించుకునే అంత స్థాయికి బాగా బలం పెంచుకుంది.
ఎప్పటి నుంచో బలమైన పునాదులు వేసుకున్న తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ పునాదులను కదిలించే పరిస్థితికి బీజేపీ బలం పెంచుకోగలిగింది.ఇదంతా ఒక్కసారిగా జరగకపోయినా, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎప్పుడైతే బాధ్యతలు బండి సంజయ్ తీసుకున్నారో, అప్పటి నుంచి బీజేపీకి ఊపు పెరిగిందనే విషయం అందరికీ అర్థమైంది.
ముఖ్యంగా బీజేపీ కేంద్ర పెద్దలంతా బండి సంజయ్ పనితీరుపై సంతృప్తిగా ఉన్నారు.అందుకే ఆయనకు పార్టీలో ప్రాధాన్యం బాగా పెంచడంతోపాటు, ఆయనకు అన్ని విషయాలలోనూ స్వతంత్రం కల్పిస్తూ వస్తున్నారు.
దీంతో మరింత ఉత్సాహంగా పార్టీని ముందుకు తీసుకు వెళ్లే విషయంలో సక్సెస్ అవుతూ వస్తున్నారు.
తెలంగాణలో బండి సంజయ్ ను స్ఫూర్తిగా తీసుకుని ఏపీలోనూ బీజేపీ నాయకులు పార్టీని మరింత బలోపేతం చేసే విషయం పైన దృష్టిపెట్టారు.
గతంతో పోలిస్తే కాస్తోకూస్తో ఏపీ లో స్పీడ్ పెంచారు.తెలంగాణతో పోలిస్తే ఏపీలో పార్టీ కి అంత సానుకూలత లేదు అనే విషయం అధిష్టానం పెద్దలకు తెలుసు.
అలాగే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలు ఉండడంతో ఈ ఎన్నికల్లో గెలవడం బీజేపీకి ప్రతిష్టాత్మకం కావడంతో, ఇక్కడ గెలుపు కోసం సరికొత్త వ్యూహాన్ని బిజెపి పెద్దలు అప్పుడే ఆలోచించారు.

తిరుపతి ఎన్నికల ప్రచారానికి తెలంగాణ బీజేపీ నేతలు బండి సంజయ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్యే రాజా సింగ్ , నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వంటి వారందరినీ తిరుపతి ఎన్నికల ప్రచారానికి దించి సక్సెస్ అవ్వాలనే ప్లాన్ బీజేపీ పెద్దలు ఆలోచించినట్లు తెలుస్తోంది.వీరికి తెలంగాణలో వచ్చిన క్రేజ్ ఇటు ఏపీలోనూ ఉంది అని , తప్పకుండా వారి ప్రచారం సక్సెస్ అవుతుందనే నమ్మకం తో ఈ ప్లాన్ వేసినట్లుగా తెలుస్తోంది.ముఖ్యంగా తిరుపతి లో బిజేపి బాధ్యతలు సంజయ్ కు అప్పగించి ఆలోచనలు అధిష్టానం ఉన్నట్లు సమాచారం.