గత రెండు రోజులుగా ప్రధాని మోదీ తెలంగాణ నుంచి పోటీ చేస్తారన్న వార్తలు ఆసక్తి ని కలిగిస్తుండగా కాంగ్రెస్ పార్టీ( Congress party ) కూడా సమఉజ్జీలను రంగంలోకి దించాలని ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది.ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలను ఒకప్పుడు కంచు కోటగా ఏలిన కాంగ్రెస్ అనేక వ్యూహాత్మక పొరపాట్లతో కొన్ని రాష్ట్రాలను చేజార్చుకుంది.
అయితే పోయిన చోట తిరిగి రాబట్టుకోవాలనే వ్యూహాన్ని అమలు చేస్తున్న కాంగ్రెస్ ఆ దిశగా కర్ణాటకను, తెలంగాణను తిరిగి తన అమ్ముల పొదిలో చేర్చుకోగలిగింది.ఇప్పుడు దక్షిణాది నుంచి భారీ ఎత్తున ఎంపీ సీట్లు కొల్లగొట్టాలంటే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని( Sonia Gandhi ) స్వయం గా తెలంగాణ నుంచి పోటీకి దింపాలని రాష్ట్ర పిసిసి నిర్ణయించింది.
![Telugu Congress, Revanth Reddy, Shabbirali, Sonia Gandhi, Yssharmila-Telugu Poli Telugu Congress, Revanth Reddy, Shabbirali, Sonia Gandhi, Yssharmila-Telugu Poli](https://telugustop.com/wp-content/uploads/2023/12/Sonia-Gandhi-Telangana-Congress-Congress-brs.jpg)
లోక్ సభ ఎన్నికల కసరత్తు తో పాటు ఆరు గ్యారెంటీల అమలుపై ఈరోజు గాంధీభవన్లో ఏర్పాటు చేసిన పిసిసి సమావేశంలో ఏకగ్రీవంగా ఈ విషయంపై పీసీసీ నిర్ణయం తీసుకుంది.అంతే కాకుండా ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే రెండు గారెంటీలు అమలు చేస్తున్నందున మిగిలిన నాలుగు అంశాల అమలుపై ఈ కమిటీ చర్చించినట్లుగా తెలుస్తుంది.త్వరలోనే రేవంత్ ఈ నాలుగు హామీల అమలుపై అసెంబ్లీలో ప్రకటిస్తారని మంత్రి షబ్బీర్ అలీ( ShabbirAli ) ప్రకటించారు.
![Telugu Congress, Revanth Reddy, Shabbirali, Sonia Gandhi, Yssharmila-Telugu Poli Telugu Congress, Revanth Reddy, Shabbirali, Sonia Gandhi, Yssharmila-Telugu Poli](https://telugustop.com/wp-content/uploads/2023/12/Sonia-Gandhi-Telangana-Congress-Congress-brs-ShabbirAli.jpg)
తెలంగాణ నుంచి సోనియా పోటీ చేస్తే ఆ ప్రభావం తెలంగాణలోని ( Telangana )మెజారిటీ ఎంపీ సీట్లు తో పాటు ఆంధ్రప్రదేశ్ పై కూడా పడుతుందన్న భారీవ్యూహం తోనే కాంగ్రెస్ ఈ నిర్ణయానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుంది.అంతేకాకుండా పూర్తిస్థాయిలో ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ ఇప్పుడు ఘర్ వాపసి దిశగా చాలామంది కీలక నాయకులతో టచ్లోకి వెళ్లినట్లుగా వార్తలు వస్తున్నాయి .ఒకపక్క షర్మిలను ఆంధ్రా లో యాక్టివేట్ చేయడానికి ప్రయత్నిస్తూనే, మరోపక్క ఒకప్పుడు కాంగ్రెస్లో ఒకప్పుడు కీలకంగా పనిచేసి ఇతర పార్టీలలో సర్దుకున్న పాత కాపులను తిరిగి వెనుకకు రమ్మని పిలుస్తుందట.తెలంగాణలోనే లనే ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయంగా కీలకంగా మారే అవకాశం ఉందని ఆయా నేతలకు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుందని వార్తలు వస్తున్నాయి.