సింగపూర్( Singapore )కు చెందిన ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఇటీవలి కాలంలో వెరైటీ ఫుడ్ కాంబినేషన్స్ ట్రై చేస్తూ నెటిజన్ల మతి పోగొడుతున్నాడు.తాజాగా ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ కోకాకోలా కోక్‌లో అరటిపండు మిక్స్ చేసి తాగేశాడు.
దీన్ని మీరు కూడా ట్రై చేయండి అంటూ ఆ ఫుడ్ కాంబో ప్రిపరేషన్‌కి సంబంధించిన వీడియో కూడా షేర్ చేశాడు.అది కాస్త సోషల్ మీడియా( Social media )లో విస్తృతంగా వైరల్ అవుతుంది.
ఇది చూసి చాలామంది షాక్ అవుతున్నారు.దీన్ని చూస్తుంటేనే కడుపులో తిప్పేస్తోందని అంటున్నారు.
కాల్విన్ లీ పేరు గల ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ బనానా కోక్ పేరిట దీన్ని తయారు చేశాడు.
అతను షేర్ చేసిన వైరల్ వీడియో ఓపెన్ చేస్తే మనకు ఒక కప్పు కోక్‌లో ఒక అరటిపండును కలుపుతూ, దానిని ద్రవంలో నలపడం కనిపిస్తుంది, అరటిపండు( Banana ) గుజ్జు బాగా కోక్‌లో కలిపిన తర్వాత ఒక కాంబో తయారవుతుంది.అది చూసేందుకే చాలా ఎబ్బెట్టుగా కనిపిస్తుంది.అయినా ఈ సింగపూర్ వ్యక్తి కప్పు తీసుకుని డ్రింక్ తాగాడు.
అది తాగాక అతడి ముఖంలో ఎక్స్‌ప్రెషన్స్ కంప్లీట్ గా మారిపోయాయి.ఈ రెండు బాగా కలిసి పోలేదని అతను చివరికి ఒప్పుకున్నాడు.
తీయగా ఉన్నా సరే ఊహించిన దాని కంటే ఘోరంగా ఉన్నట్లు ఈ ఫుడ్ కాంబోకు అతడు రివ్యూ చెప్పాడు.ఎవరూ ట్రై చేయాల్సిన అవసరం లేదని కూడా హెచ్చరించాడు.
అసలు ఈ రెండిటినీ కలిపితే మంచి టేస్ట్ వస్తుందని అతడు ఎలా భావించాడు? ఏ పనీ పాట లేక ఈ రోజుల్లో అందరూ తమ టైమ్ వేస్ట్ చేస్తున్నారని ఒకరన్నారు.ఇలాంటి చెత్త కంటెంట్ క్రియేట్ ఎందుకు చేస్తున్నాడో అని చాలామంది తిట్టిపోస్తున్నారు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.