ఒంగోలు మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి( Balineni Srinivasa Reddy ) అసంతృప్తి వ్యవహారం ఇంకా వైసీపీలో చర్చనీయాంశంగానే మారింది.ఇటీవలే బాలినేని పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై అసంతృప్తి చెంది, వైసిపి ప్రాంతీయ సమన్వయకర్త పదవికి రాజీనామా చేశారు.
ఈ వ్యవహారం వైసీపీలో పెద్ద కలకలం సృష్టించింది.వైసిపి కీలక నేతలంతా రంగంలోకి దిగి బాలినేని ని బుజ్జగించే పనికి శ్రీకారం చుట్టారు.
స్వయంగా జగన్ పిలిచి బుజ్జగించారు.

నిన్న మరోసారి ఆయన సీఎం జగన్( CM jagan ) ను కలిసి అనేక అంశాలపై చర్చించారు.జిల్లాలో తనకు వ్యతిరేకంగా పార్టీలోని కొంతమంది కీలక నేతలు వ్యవహారాలు చేస్తూ ఉండడం , తనపై ఫిర్యాదు చేయడం వంటి వ్యవహారాలపై జగన్ తో చర్చించి ఆయన ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.నిన్న జగన్ తో భేటీ అయిన తరువాత బాలినేని ఏ ఏ అంశాలు చర్చించారు అనేది ఆసక్తికరంగా మారింది.
జగన్ తో భేటీ అయిన నేపథ్యంలో వైసిపి సమన్వయకర్త పదవిలో కొనసాగుతారా లేదా అనేది తేలాల్సి ఉంది.అయితే పార్టీలో తనను ఇబ్బంది పెడుతున్న వారి గురించి ప్రధానంగా బాలినేని జగన్ తో చర్చించినట్లు సమాచారం.
అయితే ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన ఆయన నాకు ప్రోటోకాల్ కల్పించడంపై సీఎం జగన్ తో మాట్లాడలేదు అని, గతంలో మంత్రి పదవి వదిలేసాను, ప్రోటోకాల్ గురించి తాపత్రయ పడక్కర్లేదు.

నేనెప్పుడూ పార్టీపై అలక చెందలేదు.పార్టీలోని ఇద్దరు ముగ్గురు కావాలని నన్ను ఇబ్బంది పెడుతున్నారు.ఈ అంశాలపైనే పోరాడుతున్న, దీనిపైనే సీఎం తోను చర్చించాను.
సర్దుబాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.ప్రాంతీయ సమన్వయకర్త పదవికి చేసిన రాజీనామాపైన కానీ, కొత్త పోస్ట్ గురించి గానీ సీఎంతో మాట్లాడలేదు.
పార్టీలో ఉన్నవారు కావాలని నాపై మీడియాకు ఇలాంటి విషయాలు చెబుతున్నారు .మా జిల్లాలో ఉన్న సమస్యలు, ఒంగోలు నియోజక వర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీ పైనే జగన్ తో మాట్లాడాను అంటూ బాలినేని వ్యాఖ్యానించారు.అయితే బాలినేని కి ఇంకా అసంతృప్తి తగ్గలేదని, ముఖ్యంగా గతంలో జగన్ వద్ద తనకు ఉన్న ప్రాధాన్యం ఇప్పుడు తగ్గడం ముఖ్యంగా మంత్రి ఆది మూలపు సురేష్( Audimulapu Suresh ) కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, తనకు ప్రాధాన్యం తగ్గించడం వంటి వ్యవహారాలపై బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉంటూ వస్తున్నారు.అలాగే వచ్చే ఎన్నికల్లో సీటు విషయం లోనూ బాలినేని కి వ్యతిరేకంగా ఆయన ప్రత్యర్థులు పావులు కదుపుతున్నారనే విషయం జగన్ కు తెలిసినా, ఆయన సైలెంట్ గా ఉండడం వంటి వ్యవహారాలపై ఆయన అసంతృప్తితో ఉన్నారట.
జగన్ కు బంధువుగాను , పార్టీ సీనియర్ నేతగాను ఉన్న తనకు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యం దక్కడం లేదని బాలినేని తన సన్నిహితులు వద్ద ఆవేదన చెందుతున్నారట.







