ఉరుములేని పిడుగులా సడన్ గా తన పదవికి రాజీనామా చేసిన బాలినేని( Balineni Srinivas Reddy ) వ్యవహారం అధికారపక్షంలో హాట్ టాపిక్ గా మారినట్లు తెలుస్తుంది .పార్టీ పరంగా అత్యంత ముఖ్యమైన రీజనల్ కోఆర్డినేటర్ పదవి కట్ట పెట్టినప్పటికీ ఆయన అసంతృప్తిగానే ఉన్నారని .
అంతేకాకుండా ఇటీవల జరిగిన మార్కాపురం సభలో జరిగిన అవమానం తో ఆయన కు పార్టీ పట్ల విరక్తి కలిగిందని, తన అసంతృప్తిని అధిష్టానానికి తెలియజేయడానికే ఆయన తన పదవికి రాజీనామా చేశారని వార్తలు వస్తున్నాయి.వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లాలో పార్టీకి ఉన్న సీనియర్ నాయకుల లో బాలినేని ఒకరు.
2019 ఎన్నికల్లో విజయం తర్వాత జగన్ ( CM Jagan ) ఈయనకు మంత్రి పదవి ఇచ్చారు ఈయనతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లా నేత ఆదిమూలపు సురేష్( Adimulapu Suresh ) కూడా మంత్రి పదవి దక్కించుకోగలిగారు.అయితే వీరిద్దరి మధ్య వర్గ పోరు నడుస్తుంది అధిష్టానం వీరిని కలపడానికి ప్రయత్నించినప్పటికీ అది ఫలించలేదని తెలుస్తుంది.
అయితే రెండవసారి క్యాబినెట్ విస్తరణలో తన పదవి పోగొట్టుకున్న బాలినేని ని సంతృప్తి పరచడానికి రీజనల్ కోఆర్డినేటర్ పదవిని కట్టబెట్టారు .ప్రభుత్వ పదవి కాకపోయినా పార్టీ పరంగా రీజనల్ కోఆర్డినేటర్ పదవి కూడా చిన్నదేమీ కాదు.పార్టీని సంస్థగతంగా బలపరచడానికి ఆ జిల్లాలో పార్టీను అధికారంలోకి తీసుకురావడానికి రీజనల్ కో ఆర్డినేటర్ పదవి కీలకం ….
అయితే పదవి తప్ప దాని తాలూకు అధికారం తనకు దక్కడం లేదని తన మాటను ఎవరూ లెక్క చేయడం లేదని ఆయన భావిస్తున్నట్లుగా సమాచారం.ఇటీవల మార్కాపురంలో జరిగిన సభలో తనను సభ లోపలకు వెళ్లకుండా అడ్డుకున్న సీఐ మీద ఆయన అధిష్టానానికి ఫిర్యాదు చేసినప్పటికీ ఆయనపై ఇంతవరకు ఏ చర్యలు తీసుకోలేదు.అంతేకాకుండా మంత్రివర్గ విస్తరణలో తన పదవి తొలగించినప్పటికీ తన ప్రత్యర్థి అయిన ఆదిమూలపు సురేష్ తన పదవి నిలబెట్టుకోగలిగారు.
ఇలా తనకు అధిష్టానం గౌరవం తగ్గించడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అందుకే తన పదవికి రాజనామా చేశారని వార్తలు వస్తున్నాయి .మరి ఆయన పట్ల వైసీపీ అధిష్టానం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.మంత్రి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యల ప్రకారం చూస్తే బాలినేని తమ పార్టీలో కీలక నేత అని ఈ విషయం టీ కప్పులో తుఫాను లాంటిది అని ఇది తొందరలో ముగిసిపోతుందని ఆయన చెప్పుకొచ్చారు దీనిని బట్టి బాలనేని బుజ్జగించే దిశగా అధిష్టానం ముందుకు వెళ్తున్నదని తెలుస్తుంది.