నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) ప్రస్తుతం మంచి ఊపు లో ఉన్నాడు…అందుకే ఆయన వరుసగా అఖండ, వీర సింహా రెడ్డి ( Veera Simha Reddy )చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న బాలయ్య.ఇప్పుడు అనిల్ రవిపూడితో భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) అనే సినిమా చేస్తున్నాడు.
ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల కీలక పాత్రను పోషిస్తుంది.
షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం దసరా కానుకగా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇకపోతే బాలకృష్ణ సినిమాల గురించి మాట్లాడుకుంటే.మొదట గుర్తుకువచ్చేది పవర్ ఫుల్ డైలాగ్స్.అలాగే మాస్ ఫైట్స్ మరియు డ్యాన్స్‌లు బాగా హైలెట్ అవుతుంటాయి.
ముఖ్యంగా బాలయ్య సినిమాల్లో దాదాపు అరడజన్ అయినా ఫైట్ సీన్స్ ఉండాల్సిందే.లేకుంటే ఫ్యాన్సే ఒప్పుకోరు.
అయితే మీకు తెలుసా.ఒక్క ఫైట్ సీన్ లేకపోయినా సరే గతంలో బాలయ్య నటించిన ఓ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు.నారీ నారీ నడుమ మురారి.
( Naari Naari Naduma Muraari )ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా శోభన, నిరోషా హీరోయిన్లుగా నటించారు.శారద, కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, రమాప్రభ తదితరులు కీలక పాత్రలను పోషించారు.యువచిత్ర ఆర్ట్స్ బ్యానర్ పై కె.మురారి ఈ సినిమాను నిర్మించారు.1990 లో విడుదలైన కుటుంబ కథా చిత్రమిది.మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

కమర్షియల్ గా సూపర్ డూపర్ హిట్ అయింది.పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి.అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.
ఈ సినిమాలో ఒక్కటంటే ఒక్క ఫైట్ సీన్ కూడా ఉండదు.అయినా కూడా సినిమా మంచి విజయం సాధించింది అంటే కథ, కథనంలో ఉన్న దమ్ము మరియు బాలయ్య నటనే అందుకు కారణం.
ఇక మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.ఈ సినిమా షూటింగ్ తమిళనాడులో వేలచ్చేరి ప్రాంతంలోని మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ హౌస్ లో జరిగింది.
ఆల్మోస్ట్ షూటింగ్ ను అక్కడే కంప్లీట్ చేశారు.ఇక ఇక్కడ మనం చర్చించుకునే విషయం ఏంటంటే బాలయ్య అంటేనే మాస్ సినిమాలు ఫైట్స్ కి పెట్టింది పేరు అలాంటి మాస్ హీరో తో సినిమా చేసే డైరెక్టర్ ఆయన సినిమాల్లో ఒక్క ఫైట్ కూడా లేకుండా సినిమా తీయాలంటే ముందు గా ఫ్యాన్స్ ఒప్పుకోరు…ది అప్పుడంటే చెల్లింది కానీ ఇప్పుడు బాలయ్య బాబు అంటే ఫైట్ లేనిదే సినిమా ఉండదు అంటూ ఆయన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు…
.