ఆ పని వల్ల తనలో ఉన్న ఆ ఒక్క స్పెషాలిటీ కోల్పోయిన బాలయ్య?

తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు నాలుగు దశాబ్దల సినీ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలు, టాక్ షోలతో బిజీగా ఉన్నారు.ఇలా హీరోగా వ్యాఖ్యతగా బిజీగా ఉన్నటువంటి బాలకృష్ణ తాజాగా సాయి ప్రియ కన్స్ట్రక్షన్స్ కోసం బ్రాండ్ అంబాసిడర్ మారారు.

 Balayya Who Lost That One Specialty In Him Because Of That Work ,balakrishna,sa-TeluguStop.com

ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇకపోతే తన నాలుగు దశాబ్దాల సినీ కెరియర్ లో బాలయ్య ఇలాంటి యాడ్స్ చేయడానికి చాలా దూరంగా ఉన్నారు.

ఈ క్రమంలోనే ఈయన అగ్ర హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న తరుణంలోనే ఎన్నో కంపెనీలు బాలకృష్ణ చుట్టూ చేరి తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయాలంటూ అడిగారు.అయితే బాలకృష్ణ ఇలా తాను ఎలాంటి ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనని ఖరాఖండిగా చెప్పేశారు.

ఈ విధంగా ఎంత రెమ్యూనరేషన్ ఆఫర్ చేసిన బాలకృష్ణ మాత్రం ఇలాంటి కమర్షియల్ యాడ్ చేయరని స్పెషాలిటీ బాలకృష్ణకు ఉండేది.అయితే సాయి ప్రియ కన్స్ట్రక్షన్స్ ప్రమోటర్ గా వ్యవహరించిన బాలకృష్ణ తనలో ఉన్న ఈ ఒక్క స్పెషాలిటీని కూడా కోల్పోయారని తెలుస్తోంది.

Telugu Balakrishna, Balayya, Saipriya-Movie

ఇలా బాలకృష్ణ తన 47సంవత్సరాల సినీ కెరియర్లో మొదటిసారి సాయి ప్రియ కన్స్ట్రక్షన్స్ కోసం ప్రమోటర్ గా వ్యవహరించడంతో ఇందులో బాలకృష్ణకు భాగస్వామ్యం ఉందా లేకపోతే తనకు బాగా కావాల్సినవారైనా అయి ఉండాలి అంటూ కొందరు ఈ విషయంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే బాలకృష్ణ ఈ యాడ్ ద్వారా వచ్చిన రెమ్యూనరేషన్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కు డొనేట్ చేయడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube