కలియుగ ప్రత్యక్ష దైవంగా పేరుగాంచిన తిరుమల శ్రీనివాసుడు( Tirumala Srinivas ) హుండీ ఆదాయానికి అయోధ్యలోని బాలరాముడు( Bala Ramudu ) పోటీ పడుతున్నాడు.ఈనెల 22న రామమందిరంలో బాల రాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగిన సంగతి తెలిసిందే.
ఈనెల 23 న సుమారు ఐదు లక్షలకు పైగా భక్తులు అయోధ్య( Ayodhya )లో రాముల వారిని దర్శించుకుంటున్నారు.ఈ సందర్భంగా రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టీ ఇంఛార్జ్ అనిల్ మిశ్రా మాట్లాడారు.
రాముని ప్రాణ ప్రతిష్ట తరువాత పది విరాళాల కౌంటర్లను ప్రారంభించారు.ఈ ఆలయ కౌంటర్లలో నగదుతో పాటు ఆన్ లైన్క లో భక్తులు విరాళాలు సమర్పించారు.ఈ క్రమంలో ఒక్కరోజ వచ్చిన నగదు మొత్తం రూ.3 కోట్ల 17 లక్షలని పేర్కొన్నారు.ఇటు తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం సరాసరి రోజుకి రూ.3 నుంచి 4 కోట్లుగా ఉంటుంది.ఈ విధంగా శ్రీవారితో శ్రీరాముడు పోటీ పడ్డాడని తెలుస్తోంది.