మన మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం “టైగర్ నాగేశ్వర్రావు( Tiger Nageswara Rao )”.ఈ చిత్రం యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది.
మద్రాస్ ప్రెసిడెన్సీ ని గడగడలాడించిన స్టువర్టుపురం దొంగల నాయకుడు టైగర్ నాగేశ్వర్రావు జీవితం ఆధారంగా ఈ కథ రూపుదిద్దుకుంటోంది.ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు.
వంశి దర్శకత్వం వహిస్తున్నాడు.మురళి శర్మ, అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రం టీసర్ కూడా విడుదల చేసారు మేకర్స్.టీజర్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచింది.
ఈ చిత్రం అక్టోబర్ 20న విడుదల కాబోతోందని సమాచారం.ఇదిలా ఉండగా బాలకృష్ణ హీరో గా నటిస్తున్న “భగవంత్ కేసరి( Bhagwant Kesari )” చిత్రం, దీనికి ఒక్కరోజు ముందు విడుదల కాబోతోంది.
అంటే అక్టోబర్లో ఇద్దరు స్టార్లు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడబోతున్నారన్నమాట.
బాలకృష్ణ, రవితేజ ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పాడడం కొత్తేమి కాదు.గతంలో చాలా సార్లు జరిగింది.ఐతే ఇలా జరిగిన ప్రతిసారి రవితేజదే పై చేయి అయ్యింది.వీళ్లిద్దరు మొదటి సారి తలపడింది 2008 లో .2008 లో బాలకృష్ణ “ఒక్క మగాడు” తో ప్రేక్షకుల ముందుకు రాగ, అదే టైం లో రవితేజ “కృష్ణ” సినిమా రిలీజ్ అయ్యింది.ఒక్క మగాడు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్గా మిగిలాగా, కృష్ణ మాత్రం మంచి విజయం సాధించింది.ఇదే సంఘటన మళ్ళి 2009 లో కూడా రిపీట్ అయ్యింది.2009 లో బాలకృష్ణ “మిత్రుడు” సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాగ, రవితేజ “కిక్( Kick )” సినిమా తో ఢీ కొట్టాడు.మిత్రుడు అట్టర్ ప్లాప్ కాగా, కిక్ కల్ట్ క్లాసిక్ గా నిలిచింది.
తరువాత 2009 లో బాలకృష్ణ “పరమవీరచక్ర” విడుదల కాగా, రవితేజ హీరో గా నటించిన “మిరపకాయి” కూడా అదే సమయంలో విడుదలయింది.పరమవీరచక్ర ప్లాప్ కాగా, మిరపకాయ్ మంచి ప్రేక్షకాదరణ పొందింది.
ఒకటి కాదు, రెండు కాదు….ఏకంగా మూడు సార్లు రవితేజ, బాలకృష్ణను బాక్స్ ఆఫీస్ వద్ద దెబ్బకొట్టాడు.ఈ లాజిక్ ప్రకారం చూస్తే ఈసారి కూడా రవితేజ సినిమానే హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు అభిమానులు.కానీ మరికొందరు మాత్రం రెండు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నారు.
ఇంకొక విశేషం ఏమిటంటే, ఈ ఏడాది ఆక్టోబర్లోనే తమిళ్ స్టార్ విజయ్ నటిస్తున్న “లియో( Leo )” చిత్రం కూడా విడుదల కాబోతోంది.విజయ్ కు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఆదరణ మనందరికీ తెలిసినదే.
మరి ఈ మూడు చిత్రాలలో ఏ చిత్రం పై చేయి సాధిస్తుందో వేచి చూడాల్సిందే.