అన్‌ స్టాపబుల్‌ అక్టోబర్‌ 4 ముఖ్యమైన రోజు.. ఏంటో తెలుసా!

నందమూరి బాలకృష్ణ సినిమా కోసం ఎంత ఆసక్తిగా అభిమానులు ఎదురు చూస్తున్నారు.అంతే ఆసక్తిగా అన్ స్టాపబుల్ సీజన్ 2 కోసమే ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.

 Balakrishna Unstoppable Season 2 Update News, Aha Ott,balakrishna, Megastar Chi-TeluguStop.com

అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఆగస్టులో షూటింగ్‌ ప్రారంభమై సెప్టెంబర్ లో ఈ షో ప్రేక్షకుల ముందుకు వచ్చేది.కానీ బాలకృష్ణ సినిమా ఒకటి షూటింగ్ ఆలస్యం అవ్వడం వల్ల ఈ షో కూడా ఆలస్యం అయ్యింది.

ఎట్టకేలకు ఈ షో కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.తాజాగా ఒక మ్యూజికల్ వీడియో కూడా విడుదల చేసి అతి త్వరలోనే బాలకృష్ణ అన్‌ స్టాపబుల్ సీజన్ 2 తో రాబోతున్నాడంటూ ఆహా వారు అధికారికంగా ప్రకటించారు.

అన్ స్టాపబుల్ సీజన్ 2 కి సంబంధించిన కర్టెన్ రైజింగ్ కార్యక్రమం అక్టోబర్ 4వ తారీఖున హైదరాబాదులో జరగబోతున్నట్లుగా మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

అల్లు అరవింద్ మరియు బాలకృష్ణ లు మీడియా ముందుకు వచ్చి కార్యక్రమంలో ఉండబోతున్న గెస్ట్ లు మరియు ఇతర విషయాలను మీడియాతో పంచుకోబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.మొదటి ఎపిసోడ్ ఎలా ఉంటుంది అనేది అందరికి ఆసక్తిని రేకెత్తిస్తుంది.అన్ స్టాపబుల్ సీజన్ 2 లో కచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి కనిపించబోతున్నాడు అంటూ ప్రేక్షకులు చాలా నమ్మకం తో ఉన్నారు.

మరి ప్రేక్షకుల విశ్వాసం ఎంత వరకు నెరవేరుతుందో చూడాలి.బాలకృష్ణ మరియు చిరంజీవిలను ఒకే వేదికపై ఈ టాక్ షోలో చూడాలనే కోరిక ఎంత వరకు తీరుతుందో చూడాలి.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు, కనుక ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా బాలకృష్ణ టాక్ షో లో చిరంజీవి పాల్గొంటే బాగుంటుందని మెగా నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు, మరి వారి కోరిక నెరవేరేనా చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube