అన్‌ స్టాపబుల్‌ అక్టోబర్‌ 4 ముఖ్యమైన రోజు.. ఏంటో తెలుసా!

నందమూరి బాలకృష్ణ సినిమా కోసం ఎంత ఆసక్తిగా అభిమానులు ఎదురు చూస్తున్నారు.అంతే ఆసక్తిగా అన్ స్టాపబుల్ సీజన్ 2 కోసమే ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.

అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఆగస్టులో షూటింగ్‌ ప్రారంభమై సెప్టెంబర్ లో ఈ షో ప్రేక్షకుల ముందుకు వచ్చేది.

కానీ బాలకృష్ణ సినిమా ఒకటి షూటింగ్ ఆలస్యం అవ్వడం వల్ల ఈ షో కూడా ఆలస్యం అయ్యింది.

ఎట్టకేలకు ఈ షో కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.తాజాగా ఒక మ్యూజికల్ వీడియో కూడా విడుదల చేసి అతి త్వరలోనే బాలకృష్ణ అన్‌ స్టాపబుల్ సీజన్ 2 తో రాబోతున్నాడంటూ ఆహా వారు అధికారికంగా ప్రకటించారు.

అన్ స్టాపబుల్ సీజన్ 2 కి సంబంధించిన కర్టెన్ రైజింగ్ కార్యక్రమం అక్టోబర్ 4వ తారీఖున హైదరాబాదులో జరగబోతున్నట్లుగా మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

"""/"/ అల్లు అరవింద్ మరియు బాలకృష్ణ లు మీడియా ముందుకు వచ్చి కార్యక్రమంలో ఉండబోతున్న గెస్ట్ లు మరియు ఇతర విషయాలను మీడియాతో పంచుకోబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.

మొదటి ఎపిసోడ్ ఎలా ఉంటుంది అనేది అందరికి ఆసక్తిని రేకెత్తిస్తుంది.అన్ స్టాపబుల్ సీజన్ 2 లో కచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి కనిపించబోతున్నాడు అంటూ ప్రేక్షకులు చాలా నమ్మకం తో ఉన్నారు.

మరి ప్రేక్షకుల విశ్వాసం ఎంత వరకు నెరవేరుతుందో చూడాలి.బాలకృష్ణ మరియు చిరంజీవిలను ఒకే వేదికపై ఈ టాక్ షోలో చూడాలనే కోరిక ఎంత వరకు తీరుతుందో చూడాలి.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు, కనుక ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా బాలకృష్ణ టాక్ షో లో చిరంజీవి పాల్గొంటే బాగుంటుందని మెగా నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు, మరి వారి కోరిక నెరవేరేనా చూడాలి.

అక్కవరంలో ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభ