ఇద్దరు బ్యూటీలతో బాలయ్య రొమాన్స్

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నారు బాలయ్య మరియు బోయపాటి.

 Balakrishna To Romance Two Star Heroines-TeluguStop.com

గత చిత్రాలు పరాజయం పాలుకావడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు దర్శకుడు మరియు హీరో.దీంతో అదిరిపోయే కథను రెడీ చేస్తూ బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటాలని చూస్తున్నారు ఈ ఇద్దరు.

కాగా బోయపాటి దర్శకత్వంలో బాలయ్య గతంలో రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలు అందుకున్నాడు.సింహా, లెజెండ్ సినిమాలతో బాలయ్య తన కెరీర్ బెస్ట్ సినిమాలు అందుకున్నాడు.కాగా తాజాగా ఈ సినిమాలను మించిన కథను రెడీ చేస్తున్నాడట బోయపాటి.ఈ సినిమాలో బాలయ్య అదిరిపోయే గెటప్‌లో ‌‌కనిపించేందుకు రెడీ అయ్యాడు.

అయితే ఈ సినిమాలో బాలయ్య సరసన ఇద్దరు హీరోయిన్లను పెట్టేందుకు బోయపాటి రెడీ అవుతున్నాడు.

Telugu Balakrishna, Boyapati Srinu, Nayanthara, Romance, Shriya Saran, Telugu-Mo

గతంలో బాలయ్య సరసన నటించిన నయనతార, శ్రియా సరన్‌లను ఈ సినిమాలో హీరోయిన్‌గా సెలెక్ట్ చేయడానికి బోయపాటి అండ్ టీమ్ ప్రయత్నిస్తున్నారు.కాగా ఈ సినిమాలో బాలయ్య అఘోరా అవతారంలో కనిపించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.మరి బాలయ్య సరసన హీరోయిన్లుగా వీరిద్దరు ఓకే చేస్తారో లేదో చూడాలి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube