ఇద్దరు బ్యూటీలతో బాలయ్య రొమాన్స్

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నారు బాలయ్య మరియు బోయపాటి.గత చిత్రాలు పరాజయం పాలుకావడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు దర్శకుడు మరియు హీరో.

దీంతో అదిరిపోయే కథను రెడీ చేస్తూ బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటాలని చూస్తున్నారు ఈ ఇద్దరు.

కాగా బోయపాటి దర్శకత్వంలో బాలయ్య గతంలో రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలు అందుకున్నాడు.సింహా, లెజెండ్ సినిమాలతో బాలయ్య తన కెరీర్ బెస్ట్ సినిమాలు అందుకున్నాడు.

కాగా తాజాగా ఈ సినిమాలను మించిన కథను రెడీ చేస్తున్నాడట బోయపాటి.ఈ సినిమాలో బాలయ్య అదిరిపోయే గెటప్‌లో ‌‌కనిపించేందుకు రెడీ అయ్యాడు.

అయితే ఈ సినిమాలో బాలయ్య సరసన ఇద్దరు హీరోయిన్లను పెట్టేందుకు బోయపాటి రెడీ అవుతున్నాడు.

""img "aligncenter" Src="" / గతంలో బాలయ్య సరసన నటించిన నయనతార, శ్రియా సరన్‌లను ఈ సినిమాలో హీరోయిన్‌గా సెలెక్ట్ చేయడానికి బోయపాటి అండ్ టీమ్ ప్రయత్నిస్తున్నారు.

కాగా ఈ సినిమాలో బాలయ్య అఘోరా అవతారంలో కనిపించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

మరి బాలయ్య సరసన హీరోయిన్లుగా వీరిద్దరు ఓకే చేస్తారో లేదో చూడాలి.