నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు.ఇప్పటికే ప్రారంభించిన ఈ సినిమాను అతి త్వరలో సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు.
ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే సక్సెస్ కొట్టేందుకు బాలయ్యతో పాటు బోయపాటి కూడా తెగ కష్టపడుతున్నాడు.ఇక ఈ సినిమాలో బాలయ్య లుక్‌పై ఇప్పటికే సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా ఈ సినిమాలో బాలయ్య ఓ అఘోరాగా కనిపిస్తాడనే వార్త హల్‌చల్ చేస్తోంది.దీని కోసమే బాలయ్య గుండు చేసుకున్నాడని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో బాలయ్య అఘోరాగా ఎందుకు మారాడనే అంశం సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని తెలుస్తోంది.ఆధ్యాత్మికతో కూడిన ఈ పాత్రలో బాలయ్య అదిరిపోయే నటన కనబర్చనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
ఇక ఫిబ్రవరి 15 నుండి షూటింగ్ మొదలుపెట్టనున్న ఈ సినిమాలో బాలయ్య మరోసారి డ్యుయెల్ రోల్ చేస్తున్నాడు.
శ్రీకాంత్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా కన్ఫమ్ కాలేదు.
బోయపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ పవర్‌ఫుల్ యాక్షన్ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నాడు.మరి ఈ సినిమాలో బాలయ్య అసలు అఘోరాగా ఎందుకు కనిపిస్తాడో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.







