టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.హీరో విశ్వక్ సేన్ సినిమాల ద్వారా కంటే ఎక్కువగా కాంట్రవర్సీల ద్వారా బాగా పాపులారిటీ సంపాదించున్నాడన్న విషయం తెలిసిందే.
ఇక తెలుగులో దాస్ కా ధమ్కీ, ఓరి దేవుడా, పాగల్, అశోకవనంలో అర్జున కళ్యాణం, ఫలక్ నుమాదాస్( Falaknama Das ) వంటి సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు విశ్వక్ సేన్.అలాగే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే వరుసగా సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు.
ఇది ఇలా ఉంటే విశ్వక్‌సేన్( Vishwak Sen ) తాజాగా నటిస్తున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.ఇందులో నేహా శెట్టి( Neha Shetty ) హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.కృష్ణ చైతన్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా హీరో విశ్వక్ సేన్ కి అలాగే చిత్ర యూనిట్ కి బాలయ్య బాబు ఒక ఊహించని సర్ప్రైస్ ఇచ్చారు.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సెట్స్‌ను బాలకృష్ణ సందర్శించారు.అందుకు సంబంధించిన ఫొటోలను విశ్వక్‌సేన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు.ఆ ఫొటోస్ ని షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చారు.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి( Gangs of Godavari ) సెట్స్‌లో బాలకృష్ణ గారు నాకు అద్భుతమైన సర్‌ప్రైజ్ ఇచ్చారు.నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు సర్.మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను.
మీ రాకతో మా టీమ్ మొత్తం సంతోషంగా ఉంది.లవ్ యూ.లుక్ రివీల్ కాకూడదనే కారణంతో నా ఫుల్ పిక్చర్స్‌ను పోస్ట్ చేయలేకపోతున్నాను.సినిమా విడుదలయ్యాక తప్పకుండా ఫొటోలు, వీడియోలను అందరితో పంచుకుంటాను అప్పటివరకూ ఫ్రేమ్‌లో ఉన్న బాలయ్య బాబు( Balakrishna ) చాలు.
ఫైర్ అంతే అని రాసుకొచ్చారు విశ్వక్ సేన్.