చాలాకాలంగా నందమూరి కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్ ను( Jr NTR ) పక్కన పెడుతూ వస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.దీనికి తగ్గట్లుగానే టిడిపి లోను గతంలో కీలకంగా వ్యవహరించిన జూనియర్ ఎన్టీఆర్ ఆ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం సైతం నిర్వహించారు.
అయితే ఆ తర్వాత చంద్రబాబు( Chandrababu Naidu ) ఎన్టీఆర్ ను దూరం పెట్టడం వంటి పరిణామాలతో జూనియర్ ఎన్టీఆర్ కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు.నందమూరి కుటుంబానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే అంతా బాగానే ఉందని అనుకుంటున్న సమయంలో మరోసారి నందమూరి కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి.
జూనియర్ ఎన్టీఆర్ విషయంలో నందమూరి బాలకృష్ణ కు( Nandamuri Balakrishna ) ఉన్న ఆగ్రహం బహిరంగం అయ్యింది.
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ విభేదాలు బయటపడ్డాయి.ఎన్టీఆర్ ఘాట్ లో( NTR Ghat ) జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను బాలకృష్ణ తొలగించాలని ఆదేశించారు.
బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా తెల్లవారుజామున జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు నెక్లెస్ రోడ్ లో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులు అర్పించారు.
ఈ క్రమంలో పరిసర ప్రాంతాల్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ లు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత నందమూరి బాలకృష్ణ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి తండ్రికి నివాళులర్పించేందుకు అక్కడికి వచ్చారు.ఈ క్రమంలో ఎన్టీఆర్ ఘాట్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను( Jr NTR Flexis ) చూసి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెంటనే ఆ ఫ్లెక్సీలను తొలగించాలని అనుచరులకు సూచించారు.ఫ్లెక్సీలను తీసేయాలని బాలకృష్ణ ఆదేశించిన తరువాత బాలయ్య అనుచరుడు మరోసారి దీనిపై ప్రశ్నించడంతో తీసిపారేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో, ఎన్టీఆర్ అభిమానులు బాలయ్య వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కీలకమైన ఎన్నికల సమయంలో బాలయ్య ఎన్టీఆర్ విషయంలో వ్యవహరించిన తీరు తొందరపాటు చర్యని, ఎన్నికల్లో కచ్చితంగా టిడిపికి అది ఇబ్బందికరంగా మారే అవకాశం లేకపోలేదు.