పేరుకి తమిళ హీరోనే కానీ విశాల్ స్వరాష్ట్రం తెలుగు నాడు.ఎన్ని ప్లాపులు వచ్చినా వాటన్నిటినీ పక్కకి నెట్టేసి మరీ హిట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు హీరో విశాల్.
మళ్ళీ ‘కథ కళీ ‘ అనే సినిమా తో విడుదల కి సిద్దం అయిపోతున్న మన కుర్ర హీరో సంక్రాంతి మీద కన్నేశాడు.తమిళంలో ఏమో కానీ తెలుగులో మాత్రం సంక్రాంతి కి అసలు ఖాళీనే లేదు ఎదో గొడ్డు పోయినట్టు గా ఒకే సారి మూడు రోజుల్లో నాలుగు సినిమాలు విడుదల అవుతూ సంచలనం సృష్టిస్తున్నాయి.13 , 14 , 15 తేదీల్లో మూడు క్రేజీ సినిమాలు విడుదల కి సిద్దం అవుతూ ఉండగా వాటిల్లో మొదటిది ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో 13 న వస్తోంది, తరవాత వెంటనే బాలకృష్ణ డిక్టేటర్ 14 న దాంతో పాటు అదే రోజు ఎక్స్ ప్రెస్ రాజా అంటూ శర్వానంద్ వస్తున్నాడు.ఆ తరవాతి రోజు సోగ్గాడు గా నాగార్జున సిద్దం అయ్యాడు.
ఈ నాలుగు సినిమాలకే థియేటర్ లు దొరక్క నైజాం సీడెడ్ లో డిస్ట్రిబ్యూటర్ లు తలలు పట్టుకుంటూ ఉంటే మరొక పక్క తమిళ నాట నుంచి డబ్బింగ్ సినిమాతో సిద్దం అయిపోయాడు మన నల్లనయ్య విశాల్.ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న షుమారు 1500 స్ర్కీన్లను ఈ సినిమాలన్నీ పంచేసుకుంటున్నాయి.
ఇలాంటి ఠఫ్ కాంపిటీషన్ లో తమిళ తంబీ విశాల్ రేసులోకి రావడం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.ఎందరు బరిలోఉన్నా నే వచ్చేస్తున్నా అంటూ ప్రకటించాడు నల్లనయ్య.ఈ సంక్రాంతికి తన క్రేజీ ప్రాజెక్టును తెలుగులో రిలీజ్ చేయాలన్నది విశాల్ ప్లాన్.కథకళి జనవరి విడుదల అంటూ పోస్టర్ కూడా వేసేశాడు.
సోగ్గాడు, ఎక్స్ ప్రెస్ రాజా ఏమో కానీ విశాల్ గనక ఈ మధ్యలో విడుదల చేస్తే ఎన్టీఆర్ – బాలయ్య సినిమాలు కలిసి థియేటర్ లు లేకుండా విశాల్ ని ఫుట్ బాల్ ఆడేస్తారు అంటున్నారు విశ్లేషకులు.







