తెలుగు , తమిళ , హిందీ సినిమాల ప్రేక్షకులకి సుపరిచితురాలు అయిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ మూడు బాషలలో మాత్రమె కాక ఇప్పుడు కన్నడ లో కూడా అడుగు పెట్టబోతోంది.కానీ హీరోయిన్ గా మాత్రం కాదట.
ఏకంగా సింగర్ గా అక్కడ కాజల్ అడుగు పెడుతోంది.ఇదేమి వింతో మరి.ఆమె కూడా ఆ ఆఫర్ వచ్చినప్పుడు ఇలాగే అనుకుందిట , కానీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బలవంతం మీద ఓకే చెప్పిందట.కాజల్ తో కన్నడంలో ఓ పాట పాడించాలని తమన్ డిసైడైయ్యాడు.
కాజల్ ని కూడా ఒప్పించాడు.రేపోమాపో ఆమె గొంతు సవరించుకోబోతోంది.
ఇప్పటిదాకా కాజల్ ఎక్కడా పాడింది లేదు.కానీ అసలే మాత్రం పరిచయం లేని కన్నడలో పాట పాడేందుకు ఒప్పుకోవడం మాత్రం గ్రేటే.
తమన్ ఇదివరకు ఎన్టీఆర్ తోనూ ఓ కన్నడ పాట పాడించాడు.పునీత్ రాజ్ కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న 25వ చిత్రం చక్రవ్యూహ కోసమే ఆ పాట పాడాడు తారక్.







