తేజస్విని పై బాలయ్య ఫ్యాన్స్‌ ప్రశంసల వర్షం.. ఈ క్రేజ్ కు మీరే కారణం చిన్నమ్మా!

నందమూరి బాలకృష్ణ ఈ మధ్య కాలంలో అన్‌ స్టాపబుల్‌ కార్యక్రమంతో పాటు ఏ కార్యక్రమంలో కనిపించినా కూడా చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.ఒకప్పుడు ఆయన హెయిర్ స్టైల్ చాలా క్లీయర్‌ గా విగ్గు అన్నట్లు ఉండేది.

 Balakrishna New Look Credit Goes To His Daughter Tejaswini Details, Aha Ott, Bal-TeluguStop.com

కానీ ఇప్పుడు మాత్రం ఆయన హెయిర్ స్టైల్‌ చాలా నాచురల్‌ గా ఉండటంతో పాటు ఆయన బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా డ్రస్ లు వేస్తున్నాడు.ఆయన బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా మరియు వయసుకు తగ్గట్లుగా మేకప్‌ వేసుకుంటున్నాడు.

దాంతో బాలయ్య అభిమానులు న్యూ లుక్ కు ఫిదా అవుతున్నారు.ముఖ్యంగా అన్‌ స్టాపబుల్‌ షో లో అన్ని విధాలుగా బాలయ్య ను అద్భుతంగా చూపిస్తున్నారు.

బాలయ్య న్యూ లుక్ కు పూర్తి బాధ్యత ఆయన చిన్న కూతురు తేజస్వినిది అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.అన్‌ స్టాపబుల్‌ షో కు ఆమె కాస్ట్యూమ్‌ డిజైనర్‌ గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే.

తాజాగా బాలయ్య నటించగా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వీర సింహారెడ్డి సినిమా లో కూడా లుక్‌ అద్భుతంగా ఉంది.అందుకే సినిమా పై విపరీతంగా బజ్ క్రియేట్‌ అయ్యింది.

అంతటి బజ్ క్రియేట్‌ అవ్వడానికి.సినిమా యొక్క అంచనాలు పెరగడానికి కారణం కచ్చితంగా తేజస్విని యొక్క స్టైలిష్ వర్క్ అంటూ నందమూరి అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అందుకే బాలయ్య అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు బాలయ్య కూతురు తేజస్విని పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.బాలయ్య సినిమా కు ఈ స్థాయి లో క్రేజ్ రావడానికి కారణం మీరే అంటూ తేజస్విని చిన్నమ్మా అంటూ సంభోదిస్తూ నందమూరి అభిమానులు ప్రశంసిస్తున్నారు.

ముందు ముందు కూడా బాలయ్య అన్ని సినిమాలకు తేజస్విని వర్క్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube